Breaking News

పండుటాకుల గోడు విని..

Published on Fri, 03/14/2025 - 04:30

రాష్ట్రంలోనే తొలిసారిగా..
రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి నల్లగొండ జిల్లాలో వృద్ధులు, దివ్యాంగుల కోసం కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ప్రత్యేక గ్రీవెన్స్‌ను గురువారం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా పలువురు వృద్ధులు, వికలాంగులు కలెక్టరేట్‌కు తరలివచ్చి కలెక్టర్‌కు తమ బాధలను వివరించి ఆదుకోవాలని వేడుకున్నారు. వారందరికీ కలెక్టర్‌ భరోసా ఇచ్చారు.

ప్రత్యేక గ్రీవెన్స్‌కు వచ్చే వారి సమస్యలు ఎట్టిపరిస్థితుల్లో పరిష్కారం కావాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతి గురువారం ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ‘ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి 80 ఏళ్లు దాటిన వృద్ధులు, నడవలేని స్థితిలో ఉండే దివ్యాంగులు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. వారు అలా గంటల తరబడి వేచిఉండటం బాధగా అనిపించింది. అందుకే వారి సమస్యలపై ప్రత్యేకంగా ప్రతి గురువారం గ్రీవెన్స్‌ నిర్వహించాలని నిర్ణయించాను’ అని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. – సాక్షి ప్రతినిధి, నల్లగొండ

ఈయన పేరు దేవరకొండ అంజయ్య, చిట్యాల మండలం ఏపూర్‌ గ్రామం. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ఒక్కో బిడ్డకు ఒక ఎకరం చొప్పున రాసిచ్చారు. తన జీవనం కోసం ఒక ఎకరం తన పేరునే ఉంచుకున్నారు. అయితే ఒక మనవడు మభ్యపెట్టి అంజయ్య పేరున ఉన్న ఎకరం భూమిని కూడా రాయించుకున్నాడు. దీంతో ఆయనకు ఆధారం లేకుండా పోయింది. అధికారులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో ప్రత్యేక గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు తన గోడు చెప్పుకున్నారు. దీంతో మనవడు చేయించుకున్న భూమి పట్టాను రద్దుచేసి, తిరిగి అంజయ్య పేరున పట్టా జారీచేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)