Breaking News

మూడు ప్రత్యేక రైళ్లు నడిపిన దక్షిణ మధ్య రైల్వే

Published on Sun, 12/07/2025 - 04:38

సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌: విమానాలు లేక, ప్రత్యామ్నాయ సర్వీసుల సమాచారం తెలియక అయోమయంలో ఎదురుచూస్తున్న ప్రయాణికుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో శనివారం 74 డిపార్చర్‌ విమాన సర్వీసులు రద్దు కావటంతో ముఖ్య ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

⇒ శనివారం రాత్రి 9.35 గంటలకు చర్లపల్లి నుంచి షాలిమార్‌కు స్పెషల్‌ రైలు నడిపింది. 1566 బెర్తులున్న 14 కోచ్‌లతో ఇది బయలుదేరింది. 
⇒ సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి చెన్నై ఎగ్మోర్‌కు మరో ప్రత్యేక రైలు బయలుదేరింది. 1063 బెర్త్‌లతో కూడిన 14 కోచ్‌లను దీనికి ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 8 గంటలకు చెన్నై చేరుకుంటుంది. 

⇒  నాంపల్లి స్టేషన్‌ నుంచి శనివారం రాత్రి 8.25 గంటలకు ముంబై లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌కు మరో ప్రత్యేక రైలు బయలుదేరింది. 1080 బెర్తులతో కూడిన 15 కోచ్‌లున్న ఈ రైలు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ముంబై చేరుకుంటుంది. 
⇒ ఆదివారం ఉదయం చర్లపల్లి నుంచి షాలిమార్‌కు , నాంపల్లి స్టేషన్‌ నుంచి హడప్సర్‌ (పుణె శివారు)కు మరో ప్రత్యేక రైలు బయలు దేరనుంది. అవసరమైతే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. 

ఆర్టీసీ బస్సులకు అంతంత మాత్రమే...
పెద్ద సంఖ్యలో విమానాలు రద్దయ్యాయన్న విషయం తెలుసుకొని తెలంగాణ ఆర్టీసీ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా బెంగళూరు, చెన్నై, ముంబైలకు ప్రత్యేక స్లీపర్‌ బస్సులను ఏర్పాటు చేసింది. బెంగళూరు కోసం కేవలం నలుగురు ప్రయాణికులు మాత్రమే రావటంతో అంత తక్కువ మందితో బస్సును నడపలేమని, కనీసం 11 మందయినా ఉండాలని అధికారులు సూచించారు. శుక్రవారం రాత్రి చెన్నైకు 11 మందితో ఓ బస్సును నడిపారు. శనివారం కూడా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నై, బెంగళూరుకు ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఎయిర్‌పోర్టు బస్‌టెర్మినల్‌ నుంచి రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నంకు కూడా అదనపు బస్సులు ఏర్పాటు చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)