YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు
Breaking News
గోదావరి ఎక్స్ప్రెస్ సహా పలు రైళ్లు రద్దు: సౌత్ సెంట్రల్ రైల్వే
Published on Sun, 09/01/2024 - 15:48
సాక్షి,హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో రైళ్లు భారీగా రద్దవుతున్నాయి. తాజాగా గోదావరి ఎక్స్ప్రెస్ సహా 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదివారం సేవలందించాల్సిన హైదరాబాద్- విశాఖ- హైదరాబాద్ (12728/12727) గోదావరి ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు మొత్తం 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తాజా బులిటెన్ విడుదల చేసింది.
భారీ వర్షాలకు పట్టాలపై వరదనీరు చేరడంతో మరో 15 రైళ్లను దారిమళ్లిస్తున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్-భువనేశ్వర్ మధ్య సర్వీసులందించే విశాఖ ఎక్స్ప్రెస్ (17016) రైలును ఈ సాయంత్రం 4.50 గంటలకు బదులుగా సాయంత్రం 6.50గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది.
మరోవైపు, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తాజా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. రైలు సర్వీసుల పునరుద్ధరణ, భద్రతాపరమైన చర్యలపై ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ వద్ద అధికారులతో చర్చించారు.
Tags : 1