Breaking News

త్వరలో రూ. లక్షకుపైగా ఉన్న రుణాలు మాఫీ 

Published on Sun, 08/20/2023 - 03:05

మెదక్‌: త్వరలో రూ.లక్షకుపైగా ఉన్న రైతు రుణాలను సైతం మాఫీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం ఆయన మెదక్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడు తూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు రూ.99,999వరకు రుణాలన్నీ మాఫీ అయ్యాయని అన్నారు. బ్యాంకు అకౌంట్లు వినియోగంలో లేకపోవడంతో కొంతమందికి ఇబ్బంది అవుతున్నట్లు తెలిసిందన్నారు.

ఆర్థిక, వ్యవసాయ శాఖల కార్యదర్శులతో మాట్లాడి సమస్య పరిష్కార మయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో లీడర్లు లేరని, బీజేపీకి క్యాడర్‌ లేదని, ఆ రెండు పార్టీలకు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారని హరీశ్‌రావు ఎద్దే వా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పు డు అభ్యర్థుల దరఖాస్తులు అమ్ముతోందని, ఆ పార్టీ అధికా రంలోకి వస్తే రేపు రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తుందని అన్నారు.

కాంగ్రెస్‌కు రాష్ట్రంలో 35 –40 స్థానాల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని, ఎలక్షన్లలో డిపాజిట్లు దక్కించుకోవడం కోసమే ఆ పార్టీ ఆరాటపడుతోందన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా గతంలోకంటే ఈసారి తమకు ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. ఇంటి ముందు అభివృది్థ.. కంటి ముందు అభ్యర్థి నినాదంతో ముందుకు పోతామని ఆయన తెలిపారు. హరీశ్‌ వెంట ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)