Breaking News

షేర్‌ మార్కెట్‌లో నష్టాలు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

Published on Sat, 08/01/2026 - 07:57

హైదరాబాద్‌: ‘ఐ ట్రైడ్‌... లూసర్‌’ అని నోట్‌ రాసి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి  ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన మేరకు.. జార్ఖండ్‌ రాష్ట్రం బొకారో స్టీల్‌ సిటీకి చెందిన సుజిత్‌ పండిట్‌ కుమార్‌(26) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని వాసవి జీపీ ట్రెండ్స్‌లో త్రీ బీహెచ్‌కేలో నివాసముంటున్నాడు. ఒక రూమ్‌లో సుజిత్, మరో రెండు రూమ్‌లలో హర్ష, వివేక్‌లు ఉంటున్నారు. 

మిగతా ఇద్దరు కంపెనీలకు డ్యూటీకి వెళ్లగా, రాత్రి సమయంలో వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసిన సుజిత్‌ గురువారం ఇంటి వద్దనే ఉన్నాడు. గురువారం మధ్యాహ్నం 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకడంతో సుజిత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రం 4.30 గంటల సమయంలో సెక్యూరిటీ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే సుజిత్‌ కొంతకాలంగా షేర్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేయడంతో దాదాపు రూ.25 లక్షల నష్టం వచి్చనట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్‌ యాప్‌లలో లోన్‌ తీసుకోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘ఐ ట్రైడ్‌... లూసర్‌’ అని ఓ చిట్టీపై నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరులో ఉన్న సోదరుడు అజిత్‌ పండిట్‌ కుమార్‌  హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శుక్రవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని సోదరుడికి అప్పగించారు.    

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)