Breaking News

సెంట్రల్‌ లైటింగ్‌ పోల్‌ మీదపడి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుర్మరణం

Published on Wed, 09/03/2025 - 14:29

హైదరాబాద్: విద్యుత్‌ సెంట్రల్‌ లైటింగ్‌ పోల్‌ మీద పడి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. నాచారం ఇన్‌స్పెక్టర్‌ రుద్వీర్‌కుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున స్థానిక వీఎస్టీ కాలనీకి చెందిన భజరంగ్‌ యూత్‌ ఆసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తున్నారు. 

అదే సమయంలో కార్తీకేయనగర్‌కు చెందిన  స్వాథిక్‌ (23) బైక్‌ ఆ మార్గంలో వెళుతున్నాడు.  మార్గమ«ధ్యలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ సమీపంలో వినాయకుడిని తరలిస్తున్న లారీ  రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్‌ స్తంభానికి కట్టిన కేబుల్‌ వైర్‌ను తాకింది. దీంతో రెండు స్తంభాలు విరిగిపోయాయి, ఒక స్తంభం గణేష్‌ విగ్రహంపై పడగా, మరో స్తంభం విరిగి సాథీ్వక్‌ తలపై పడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వాహనం డ్రైవర్‌ ఏడుకొండలు, భజరంగ్‌ యూత్‌ ఆసోసియేషన్‌ ఆర్గనైజర్‌ వెంకటే‹Ùపై పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు. 

వినాయక చవితికి వచ్చి అనంతలోకాలకు.. 
స్వాథిక్‌ పూణేలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలకు నాచారం వచి్చన అతను బెంగళూరు నుంచి వచి్చన తన స్నేహితుడి కలిసేందుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా మృత్యువాత పడ్డాడు.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)