Breaking News

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

Published on Sun, 08/10/2025 - 11:32

గచ్చిబౌలి: అదుపు తప్పి కారు పల్టీ కొట్టడంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుర్మరణం పాలైన ఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన మేరకు.. చత్తీస్‌ఘడ్‌ రాయపూర్‌కు చెందిన రూపక్‌ త్రిపాఠి(30) మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కేపీహెచ్‌బీలో తమ్ముడు శాశ్వత్‌ త్రిపాఠితో కలిసి నివాసం ఉంటున్నారు.  స్నేహితులతో కలిసి ఎర్టిగా కారులో కేపీహెచ్‌బీ నుంచి నాలెడ్జీ సిటీకి వెళుతుండా టీ హబ్‌ రోడ్డులో శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో  కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. నాలుగు పల్టీలు కొట్టడంతో బెలూన్‌ తెరుచుకున్నప్పటికీ డ్రైవింగ్‌ చేస్తున్న రూపక్‌ త్రిపాఠి తలకు తీవ్ర గాయాలయ్యాయి. 

మాదాపూర్‌లోని మెడికొవర్‌ హస్పిటల్‌లో చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందాడు. కారులో ఉన్న సోదరునితో పాటు స్నేహితులు వైభవ్‌ పాటిల్, ఇషాన్‌ త్రిపాఠి, ఎస్‌ రాజ్‌ సింగ్‌లు క్షేమంగా బయటపడ్డారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూనే ఇటీవల రూపక్‌ త్రిపాఠి మొబైల్‌ యాప్‌ను డెవలప్‌ చేశాడు. యాప్‌ను లాంచ్‌ చేయాల్సి ఉందని చెప్పి చత్తీస్‌ఘడ్‌ నుంచి వారం రోజుల క్రితం ముగ్గురు స్నేహితులను పిలిపించుకున్నాడు. తెల్లవారు జామున ఐటీ కారిడార్‌ చూసేందుకు వెళుతూ కారు అదుపుతప్పడంతో రూపక్‌ త్రిపాఠి తిరిగి రాని లోకాలు వెళ్లాడు.కారు ముందు చక్రం ఊడిపోయి నుజ్జునుజ్జు అయ్యింది. పోలీసులు మృత దేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన  కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)