Breaking News

నేను భూమి మీద ఉండి ఉద్ధరించేది ఏం లేదు..!

Published on Sun, 07/27/2025 - 06:28

గచ్చిబౌలి (హైదరాబాద్‌): ‘ఎక్కడ చూసినా కరప్షన్, పొల్యూషన్‌. నేను భూమి మీద ఉండి ఉద్ధరించేది ఏం లేదు. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నా’అంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నాలుగు పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ వెంకన్న తెలిపిన వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌ రాజమహేంద్రవరానికి చెందిన గుత్తుల వేణుగోపాల్‌ (26) రాయదుర్గంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన అన్నావదినలతో కలిసి మణికొండలోని షిరిడి సాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు. 

ఈ నెల 23న అన్న, వదినలతో కలిసి రాజమహేంద్రవరానికి వెళ్లారు. అదే రోజు రాత్రి వేణుగోపాల్‌ తిరిగి మణికొండకు వచ్చాడు. 24న తల్లిదండ్రులతో ఫోన్‌ మాట్లాడగా, 25న ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం వాచ్‌మెన్‌కు ఫోన్‌ చేశారు. వాచ్‌మన్‌ వెళ్లి కిటికీలోంచి చూడగా వేణుగోపాల్‌ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులకు వీడియో కాల్‌ చేసి చూపించాడు. దీనిపై రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. శనివారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)