Breaking News

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

Published on Thu, 07/24/2025 - 09:15

గచ్చిబౌలి: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం పట్టణం, గాంధీనగర్‌కు చెందిన చింతల యామిని (27) ఇందిరానగర్‌లోని జేకే పీజీ హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. 

మంగళవారం ఉదయం ఖమ్మం వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు బయలుదేరిన ఆమె వాంతులు కావడంతో కొద్దిసేపటికే హాస్టల్‌కు తిరిగి వచి్చంది. అనంతరం తన రూమ్మేట్స్‌ నిఖిత, రాణిలతో కలిసి టిఫిన్‌ చేసి హాస్టల్‌లోనే ఉండిపోయింది. ఆఫీసుకు వెళ్లిన ఆమె స్నేహితులు సాయంత్రం గదికి తిరిగి వచ్చి చూడగా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో హాస్టల్‌ నిర్వాహకుల సహాయంతో కిటికీ అద్దాలు పగులగొట్టి చూడగా కిటికీ గ్రిల్‌కు చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది. 

పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యామినికి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాకపోవడంతో పోలీసులు ఆమె కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు. బుధవారం పోస్టు మార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Gachibowli: పీజీ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)