Breaking News

జీవితంపై విరక్తితో నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు..!

Published on Wed, 07/09/2025 - 10:13

హైదరాబాద్: జీవితంపై విరక్తి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడిగినేని చైతన్య (35) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. గత ఏప్రిల్‌ 23న నాగ మౌనికతో వివాహమైంది. 

ఈ దంపతులు కేపీహెచ్‌బీ, 7వ ఫేజ్‌లోని ఎల్‌ఐజీ–43లో నివాసం ఉంటున్నారు. ఆషాఢ మాసం నేపథ్యంలో జూన్‌ 21న నాగ మౌనిక పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలోని తల్లిగారింటికి వెళ్లింది. ప్రతిరోజూ ఆమె ఫోన్‌లో భర్తతో మాట్లాడుతూ ఉండేది. సోమవారం రాత్రి 10 గంటలకు ఫోన్‌లో అతనితో మాట్లాడింది. అప్పటికే తన భర్త దిగులుగా మాట్లాడటంతో కొద్ది సేపటి తర్వాత ఫోన్‌ కట్‌ అయింది. అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో చైతన్యకు ఫోన్‌ చేయగా ఎత్తలేదు. 

పలుమార్లు ప్రయత్నించినా స్పందన లేకపోవంతో వెంటనే తన మామకి సమాచారం అందించింది. వెంటనే కింది అంతస్తులోకి వెళ్లి చైతన్యను పిలవగా ఎంతకీ స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. చైతన్య సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. వెంటనే విషయాన్ని మౌనికకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు మౌనిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. తన భర్త జీవితం పట్ల విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కేపీహెచ్‌బీ పోలీసులు చెప్పారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)