Breaking News

సర్పంచ్‌గా పోటీ చేయాలని అమెరికా నుంచి వచ్చేశాడు..

Published on Fri, 11/28/2025 - 08:01

చిన్నశంకరంపేట(మెదక్‌): అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. లక్షల్లో వేతనం.. అయినా గ్రామాభివృద్ధే ధ్యేయంగా సర్పంచ్‌ ఎన్నికల బరిలో దిగేందుకు తరలివచ్చాడు మెదక్‌ జిల్లా(Medak District) చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ కంజర్ల చంద్రశేఖర్‌. చిన్నశంకరంపేట(Chinna Shankarampeta) సర్పంచ్‌గా తన తాత శంకరప్ప 40 ఏళ్ల పాటు పనిచేసి గ్రామాభివృద్ధిలో భాగస్వామి అయ్యారు. గ్రామంలో ఏ నోట విన్నా శంకరప్ప చేసిన అభి వృద్ధి గురించే చెప్పుకుంటారు. 

అదే స్ఫూర్తితో తాను సైతం గ్రామ అభివృద్ధిలో భాగస్వామి కావాలనే లక్ష్యంతో రూ.లక్షల వేతనం అందించే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం(Software Engineer) వదిలాడు. ఆరునెలల క్రితం పంచాయతీ నోటిఫికేషన్‌ వెలువడుతుందనే ప్రభుత్వ ప్రకటనతో.. చంద్రశేఖర్‌ అమెరికా నుంచి గ్రామానికి చేరుకున్నాడు. మూడు నెలలుగా ప్రజలతో మమేకమై స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా, ముందు వరుసలో నిలిచి గ్రామస్తుల మన్ననలు పొందుతున్నాడు. ఈనెల 30న చిన్నశంకరంపేట సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు సమాయత్తం అవుతున్నాడు.

 

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)