Breaking News

రూ.20 లక్షలు ఇస్తా.. నన్ను మరిచిపో..

Published on Thu, 02/20/2025 - 07:35

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌) : ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సదరు యువతితో చనువుగా మెదిలాడు. పెళ్లి మాట ఎత్తేసరికి మాత్రం.. మరిచిపో అంటూ తాపీగా చెప్పేశాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–10లోని గాయత్రీహిల్స్‌లో నివసిస్తున్న సాయిప్రణీత్‌ (26) సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పని చేస్తున్నాడు. 

 ఆయన బెంగళూరులో ఉన్న సమయంలో 2023లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఒకే హాస్టల్‌ గదిలో పేయింగ్‌ గెస్ట్‌గా ఉండేవారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మిన యువతి సాయిప్రణీత్‌తో సాన్నిహిత్యం పెంచుకుంది. అనంతరం నగరంలోని గాయత్రీ హిల్స్‌కు మకాం మార్చిన సాయిప్రణీత్‌.. కొద్ది రోజులు యువతితో కలిసి సహజీవనం కూడా చేశాడు. తన చెల్లెలి పెళ్లి తర్వాత మన పెళ్లి జరుగుతుందంటూ ఆమెను నమ్మించి గత ఏడాది నవంబర్‌లో వెళ్లిపోయాడు.

మీ చెల్లెలి పెళ్లి ఫొటోలు పంపించాలని యువతి చెప్పగా.. కొన్నింటిని పంపించాడు. ఆ ఫొటోలను చూసి అనుమానం వచ్చినది బాధితురాలు ఇటీవల మరింతగా ఒత్తిడి చేయడం ప్రారంభించింది.  దీంతో రెండు రోజుల క్రితం సాయిప్రణీత్‌ గదికి వెళ్లిన ఆమెను కొట్టి.. మెడ పట్టి గెంటివేశాడు. ఇన్ని రోజులు నాతో తిరిగినందుకు ఖరీదుగా రూ.20 లక్షలు ఇస్తాను.. మన బంధం మరిచిపో అంటూ చెప్పేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు జూబ్లీహిల్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)