విజయశాంతి ఫ్యామిలీకి బెదిరింపులు.. బజారుకీడుస్తా.. చంపేస్తా అంటూ..

Published on Sat, 04/12/2025 - 07:37

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (Vijayashanti) దంపతులను చంపేస్తానంటూ బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు చంద్రశేఖర్‌ రెడ్డి అనే వ్యక్తి మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు పంపించాడు. దీంతో, విజయశాంతి.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల ప్రకారం.. చంద్రకిరణ్‌ రెడ్డి అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్‌కు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తాను సోషల్‌ మీడియాలో ప్రమోషన్స్‌ చేస్తానని ప్రసాద్‌కు చంద్రకిరణ్‌ చెప్పుకున్నాడు. దీంతో, తమకు కూడా ప్లస్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో శ్రీనివాస ప్రసాద్‌.. పనితీరు చూశాక కాంట్రాక్ట్‌ ఇస్తామని చంద్రకిరణ్‌కు చెప్పాడు. అయితే, కొద్దిరోజుల తర్వాత అనుకున్న స్థాయిలో అతడు పనిచేయకపోవడం.. సరైన ఫలితాలు రాకపోవడంతో అతడితో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే శ్రీనివాస ప్రసాద్‌ ఆఫీసు నుంచి పంపించేశారు.

ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం.. తనకు డబ్బులను ఎప్పుడు చెల్లిస్తారంటూ శ్రీనివాసప్రసాద్‌కు చంద్రకిరణ్‌ రెడ్డి మెసేజ్‌ చేశాడు. ఎలాంటి కాంట్రాక్ట్‌ లేకుండా.. చంద్రకిరణ్‌ డబ్బులు అడగడంతో శ్రీనివాస్‌ ప్రసాద్‌ ఆశ్చర్యపోయారు. దీంతో, తన ఆఫీసుకు వచ్చి.. దీనిపై మాట్లాడాలని శ్రీనివాస్‌ సూచించారు. కానీ, చంద్రకిరణ్‌.. ఆఫీసుకు రాకపోగా.. మెయిల్స్‌, మెసేజ్‌లతో బెదిరింపులకు దిగాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే.. విజయశాంతి, శ్రీనివాస్‌ను చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చాడు. అలాగే, వారి కుటుంబాన్ని రోడ్డుకు ఈడుస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో విజయశాంతి దంపతులు.. అతడిపై బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చ‌ద‌వండి: వార్నీ.. ఎయిర్‌పోర్టును కూడా వ‌ద‌ల‌రా?  

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)