Breaking News

అర్ధ గంటలోనే స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి

Published on Thu, 05/08/2025 - 19:40

సాక్షి, హైద‌రాబాద్‌: స్లాట్‌ బుకింగ్‌ విధానం సత్ఫలితాలు ఇస్తుండటంతో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ శాఖ సరికొత్త ఉత్సాహంతో ముందడుగు వేస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగంగా చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. రెండో దశలో మరికొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. తెలంగాణ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ సంస్కరణల్లో భాగంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. స్థిరాస్తి దస్తావేజుల సత్వర రిజిస్ట్రేషన్ల కోసం ప్రయోగాత్మకంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతగా గత నెల 10వ తేదీ నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఆజంపురా, చిక్కడపల్లి, మేడ్చల్‌ ఆర్వో, కుత్బుల్లాపూర్, వల్లభ్‌ నగర్, శంషాబాద్, సరూర్‌ నగర్, చంపాపేట్‌ (Champapet) సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని అధికారులు అమలు చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి రెండో విడతగా హైదరాబాద్, హైదరాబాద్‌ సౌత్, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లతోపాటు ఫరూక్‌ నగర్, షాద్‌నగర్, మహేశ్వరం, వనస్థలిపురం, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఘట్‌కేసర్, నారపల్లి, మల్కాజ్‌గిరి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో స్లాట్‌ బుకింగ్‌ (Slot Booking)  ద్వారా స్థిరాస్తి దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు వెసులుబాటు కలగనుంది.

అర్ధగంటలోనే... 
సబ్‌ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల కోసం గంటల తరబడి నిరీక్షించే పనిలేకుండా కేవలం అర్ధగంటలోపు దస్తావేజుల నమోదు ప్రక్రియ పూర్తవుతోంది. ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజుల రిజిస్ట్రేషన్ల కోసం సమర్పించే పద్ధతి కూడా అడ్డుకట్ట పడినట్లయింది. దస్తావేజుల తాకిడి వల్ల జరిగే జప్యాన్ని నివారించేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు రోజువారీగా కనీసం 48 స్లాట్ల చొప్పున కేటాయిస్తున్నారు. దస్తావేజుల తాకిడి అధికంగా గల సబ్‌ రిజిస్ట్రార్లలో మాత్రం 144 స్లాట్స్‌ అందుబాటులో ఉంటాయి.

ఈ కార్యాలయాల్లో సబ్‌ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్‌ రిజిస్ట్రార్‌ విధులు నిర్వహిస్తున్నారు. అయితే దస్తావేజుల స్లాట్ల టైమింగ్‌ ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతోంది. స్లాట్‌ బుక్‌ చేసుకొని అత్యవసర దస్తావేజుదారుల కోసం ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఐదు వాక్‌ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తున్నారు. నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ (First Come First Serve) పద్ధతిలో దస్తావేజులు స్వీకరించి నమోదు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. 

చ‌ద‌వండి: మిస్‌ వరల్డ్‌ 2025.. హైద‌రాబాద్‌లో సందడే సంద‌డి  

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)