Breaking News

మృతుల గుర్తింపునకు ఆరు పద్ధతులు

Published on Sat, 10/25/2025 - 05:58

సాక్షి, హైదరాబాద్‌: మొన్న మహబూబ్‌నగర్‌ సమీపంలోని పాలెం... నిన్న కర్ణాటకలోని కలబురిగి ప్రాంతం... తాజాగా కర్నూలు సమీపంలోని చిన్న టేకూరు... ఇలా అనేక సందర్భాల్లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సులు అగ్నిప్రమాదాలకు లోనవుతున్నాయి. ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాల్లో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మాడిమసైపోతున్నాయి. ఆయా సందర్భాల్లో మృతులను గుర్తించడానికి పోలీసులు, ఫోరెన్సిక్‌ నిపుణులు ప్రధానంగా ఆరు రకాల పద్ధతుల్ని అనుసరిస్తుంటారు.  

1. సీటు నంబర్‌ 
ఇది ప్రాథమిక అంశం. మృతదేహం పడి ఉన్న సీటు నంబర్‌ను బస్సు బయలుదేరే ముందు రూపొందించిన ప్రయాణికుల జాబితాతో సరిచూస్తారు. దీనిద్వారా ఆ సీటులో ఎవరు కూర్చున్నారో తెలుస్తుంది. అయితే మార్గమధ్యలో సీట్లు మారే అవకాశం ఉండటంతోపాటు ప్రమాద ప్రభావం వల్ల మృతులు సీట్లలో ఉండకపోవచ్చు. దీంతో ఈ విధానాన్ని పూర్తి ప్రామాణికంగా తీసుకోరు.  

2. ఆభరణాలు 
    మృతదేహాలను స్వా«దీనం చేసుకొనే సందర్భంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహిస్తారు. అందులో మృతదేహాన్ని ఏ సీటు నుంచి స్వా«దీనం చేశారనే అంశంతోపాటు మృతదేహంపై ఒకవేళ నగలు, ఆభరణాలు ఉంటే ఆ వివరాలను పొందుపరుస్తారు. భద్రపరిచిన ఆభరణాలను సంబం«దీకులకు చూపి గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తారు.  

3. దుస్తులు, వస్తువులు 
ప్రయాణం ప్రారంభించే ముందు ఆయా ప్రయాణికులు ధరించిన దుస్తులు, వెంట తీసుకువెళ్తున్న వస్తువులు సైతం ఈ తరహా ప్రమాదాల్లో కీలక ఆధారాలుగా నిలుస్తాయి. మృతదేహంపై లభించే దుస్తులకు సంబంధించిన ఆనవాళ్ల కోసం ప్రయతి్నస్తారు. ఒకవేళ ఫలితం లేకుంటే కాలిపోగా మిగిలిన సూట్‌కేసులు, బ్యాగులు, సెల్‌ఫోన్లు, లైటర్ల వంటివి సేకరిస్తారు. వాటిని కూడా పంచనామాలో పొందుపరిచి వాటి ఆధారంగానూ మృతుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తారు. 

4. శరీరం, గాయాలు 
ఎత్తు, ఒడ్డు, పొడుగు వంటి శరీరాకృతులను, ఎముకల ద్వారా తెలుసుకోవడంతోపాటు గాయాలు, అంగవైకల్యాలు తదితరాలు సైతం మృతదేహాల గుర్తింపునకు ఉపకరిస్తాయి. కుటుంబీకుల నుంచి చనిపోయిన వ్యక్తి వైద్య చరిత్రతోపాటు దంతాల వివరాలను సేకరించి వాటిని మృతదేహాలతో పోలి్చచూస్తారు. గతంలో ఆపరేషన్లు జరిగినా, కాళ్లు–చేతులు తదితరాలు విరిగాయా? తదితర వివరాలన్నింటితోనూ మృతుల్ని గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. 

5. బ్లడ్, డీఎన్‌ఏ 
మృతదేహం పూర్తిగా కాలిపోయినా అంతర్గత అవయవాల్లో కొంతవరకు రక్త నమూనాలు ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదీ సాధ్యం కానప్పుడు బోన్‌మ్యారోను సేకరించడం ద్వారా బ్లడ్‌గ్రూప్‌ను విశ్లేషిస్తారు. దీన్ని రక్త సంబం«దీకులతో సరిపోల్చి మృతుల్ని గుర్తిస్తారు. బ్లడ్‌ గ్రూపింగ్‌తోపాటు ఇతర విధానాలకు అవకాశం లేని సందర్భాల్లో డీఎన్‌ పరీక్షలే శరణ్యమవుతాయి. అత్యధిక కేసుల్లో వాటి ద్వారానే గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది. మృతదేహంలోని అతిచిన్న ఆధారం నుంచైనా డీఎన్‌ఏ సేకరించే అవకాశం ఉండటం కలిసొచ్చే అంశం. 

6. సూపర్‌ ఇంపొసిషన్‌ 
గుర్తించాల్సిన మృతదేహం ఫలానా వారిదనే అనుమానం ఉండి డీఎన్‌ఏ–బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరించే అవకాశం లేనప్పుడే ఈ విధానాన్ని అనుసరిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ఘటనాస్థలిలో లభించిన పుర్రెను అత్యా«ధునిక పరికరాలతో విశ్లేషించి కంప్యూటర్‌ సాయంతో దానికి ముఖాకృతిని ఇస్తారు. దీన్ని అనుమానితుల ఫొటోలతో సరిపోల్చడం ద్వారా మృతులను గుర్తిస్తారు. ఇది అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)