Breaking News

తీవ్ర విషాదం: ‘అమ్మా ఇంటికి వస్తున్నా’, వంట చేయమన్నావు కదరా!

Published on Mon, 11/14/2022 - 08:42

పెద్దపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు.. అమ్మా ఇంటికి వస్తున్నా.. వంట చేయమన్నావు కదరా.. అంటూ వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని కూనారం గ్రామానికి చెందిన కొట్టె పురుషోత్తం–భాగ్యమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు కుమారస్వామి, రమేశ్, ప్రభాకర్‌(42)లు ఉన్నారు. 

కుమారస్వామి 15 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పురుషోత్తం తాను చేస్తున్న సింగరేణి ఉద్యోగాన్ని చిన్న కుమారుడు ప్రభాకర్‌కు పెట్టించాడు. దీంతో అతను సీసీ శ్రీరాంపూర్‌ పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సెలవు కావడంతో ద్విచక్రవాహనంపై స్వగ్రామం వస్తున్నాడు. రామగుండం ఎన్టీసీపీ క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. 

మృతుడికి భార్య కవిత ఉంది. సంఘటన స్థలాన్ని ఎస్సై జీవన్‌ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిననట్లు పేర్కొన్నారు. ప్రభాకర్‌ మృతదేహాన్ని రాత్రి కూనారం తీసుకురాగా కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఎంపీపీ నూనేటి సంపత్‌ కుమార్‌ యాదవ్, సర్పంచ్‌ డొంకెన విజయ, ఎంపీటీసీ సభ్యురాలు కొల్లూరి రమాదేవి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ కొట్టె సుజాత, సింగిల్‌విండో చైర్మన్‌ గజవెల్లి పురుషోత్తం, నాయకులు కొట్టె సమ్మయ్య, గ్రామస్తులు నివాళులరి్పంచారు. 

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)