Breaking News

ఎస్సై రాజేష్‌ ఏసీబీకి చిక్కారంట.. సంబరాలు చేసుకున్న స్థానికులు

Published on Tue, 11/18/2025 - 19:31

సాక్షి,మెదక్‌: అవినీతికి అడ్డుకట్ట వేసే దిశగా ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. తాజాగా, మెదక్‌ జిల్లా టెక్మాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై రాజేష్‌ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

వివరాల్లోకి వెళితే.. ఎస్సై రాజేష్‌  ఓ వ్యక్తి నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటున్నారనే సమాచారంతో ఏసీబీ అధికారులు టెక్మాల్‌  పోలిస్‌ స్టేషన్‌లో ఆకస్మికంగా దాడులు చేశారు. ఏసీబీ అధికారుల రాకను గమనించిన ఎస్సై రాజేష్‌ పరారయ్యే ప్రయత్నం చేశాడు. అయితే, అప్రమత్తమైన ఏసీబీ బృందం వెంటాడి అతన్ని పట్టుకుంది. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.



ఈ ఘటనపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సై రాజేష్‌ అవినీతిపరుడిగా వ్యవహరిస్తున్నాడని గతంలోనే పలుమార్లు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. చివరికి అతను ఏసీబీకి చిక్కడంతో ప్రజలు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరిపారు. టెక్మాల్‌ వీధుల్లో ప్రజల ఆనందోత్సాహం అంబరాన్ని తాకింది. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)