Breaking News

ఇవి.. సహజసిద్ధ'మండి'!

Published on Fri, 09/27/2024 - 09:41

బంజారాహిల్స్‌: రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా లభించే వనరులతో చేతితో తయారు చేసిన దుస్తులు, కళాకృతుల ప్రదర్శన ‘మండి’ పేరుతో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ భవన్‌లో గురువారం ప్రారంభమైంది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనను సినీ నటి, యాంకర్‌ ఝాన్సీ ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత హస్తకళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. పూర్తిగా చేతితో తయారు చేసిన ఈ ఆకృతులు నగర మహిళలను ఆకట్టుకున్నాయి. ఎలాంటి కెమికల్స్‌ ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధంగా వినియోగించిన సామాగ్రితోనే అల్లిన బుట్టలు, నేసిన దుస్తులు, తయారుచేసిన పర్‌ఫ్యూమ్‌లో ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగర నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేశారు.

ముఖ్యంగా ఎకోఫ్రెండ్లీ బ్యాగులు, దుస్తులు, ఇతర వస్తువులు ఇక్కడ ఆకట్టుకుంటున్నాయి. ఎంబ్రాయిడరీ వర్క్‌ మరో ఆకర్షణగా నిలిచింది. సెరామిక్‌ జ్యువెలరీ, జూట్‌ బ్యాగులు, కేరళ మురల్‌ ఆర్ట్, హ్యాండ్‌మేడ్‌ పేపర్‌ ప్రొడక్ట్స్, రస్టిక్‌ సెరమిక్‌ పీసెస్, పామ్‌ లీఫ్‌ ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించారు. పర్యావరాణానికి పెద్దపీట వేస్తూ హస్తకళాకారులు తీర్చిదిద్దిన ఈ ఆకృతులను సదరు కళాకారులు ఒక వైపు ఆన్‌లైన్‌లో విక్రయిస్తూనే మరోవైపు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతున్నారు.

ఎకోఫ్రెండ్లీ ఉత్పత్తులకు హైదరాబాద్‌ బ్రాండ్‌గా మారిందని ఈ సందర్భంగా పలువురు హస్తకళాకారులు తెలిపారు. ప్రదర్శనలో సీసీటీ చైర్‌పర్సన్‌ అనురాధ బిష్ణోయ్‌ కూడా పాల్గొన్నారు.

ఇవి చదవండి: ఇన్‌ఫ్లుయెన్సర్స్‌.. @రూ. 5 వేల కోట్లు!

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)