Breaking News

మాతో పెట్టుకుంటే రక్తపు మరకలే.. 

Published on Mon, 04/14/2025 - 13:36

వేములవాడ: వేములవాడ పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో ఆదివారం సాయంత్రం ఓ ఫంక్షన్‌ హాల్‌ మర్డర్‌తో దద్దరిల్లింది. ఆగ్రహావేశాలతో రెండు గొడ్డళ్లు, కత్తితో హత్య చేసిన దశ్యాలు కలచివేశాయి. ఈ దారుణ ఘటన అనంతరం నేనే బైరెడ్డి.. రక్తపు మరకలే సాక్ష్యం.. ఎవడినీ వదలను అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది డ్రగ్స్‌ ముఠా, గంజాయి గుంపుల మధ్య అంతర్గత వివాదంగా గుర్తించినట్లు సమాచారం. 

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పట్టణంలోని బైపాస్‌ రోడ్డులోని మహాలింగేశ్వర ఫంక్షన్‌ హాల్‌ ఆదివారం సాయంత్రం భయంకరమైన హత్య జరిగింది. రెండు గొడ్డళ్లు, ఒక కత్తితో దుండగులు వేములవాడ రూరల్‌ మండలం నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పర్శరాం(36)ను నిర్దాక్షిణ్యంగా మెడ, తలపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. మృతుడికి భార్య కల్యాణి, కూతురు అమ్ములు, కుమారుడు బబ్లీ ఉన్నారు. ఫంక్షన్‌ హాల్లో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు చేరుకొని శవాన్ని ఫంక్షన్‌ హాల్‌ బంగ్లాపై నుంచి కిందికి దించి ట్రాక్టర్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచగా.. పోలీసులు స్పందించలేదు.  

ట్రాక్టర్‌ వద్ద రోదనలు.. 
మృతుడి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఘటనా స్థలానికి రాగా.. భార్య స్పృహ తప్పి పడిపోయింది. చిన్న పిల్లలు డాడి ఎక్కడ అంటూ అడగడంతో.. స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. అతడి మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ ట్రాక్టర్‌ పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు.  

తమతో పెట్టుకుంటే రక్తపు మరకలే.. 
తమతో పెట్టుకుంటే రక్తపు మరకలే అంటూ సదరు అనుమానితుల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కత్తులు, గొడ్డలితో అత్యంత భయంకరంగా వ్యవహరిస్తూ తమతో పెట్టుకుంటే రక్తపు మరకలు అని బెదిరింపులకు పాల్పడినట్లుగా వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. అనుమానితులు 25 ఏళ్ల వయసు లోపున్న వారే కావడం, యువత దారి తప్పిన విధానం వేములవాడలో కలకలం రేపుతోంది. అనుమానితులు ఇప్పటికే ఒక హత్య కేసులో నిందితులుగా ఉన్నట్లు సమాచారం. వేములవాడలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.  

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)