Breaking News

హనుమకొండలో నర్సింగ్ స్టూడెంట్ పై యాసిడ్ దాడి

Published on Tue, 12/02/2025 - 09:32

హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో సోమవారం యువతిపై యాసిడ్‌ దాడి కలకలం రేపింది. స్థానికులు, మడికొండ పోలీసులు వివరాలు తెలిపారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం వడ్డెగూడెం గ్రామానికి చెందిన సునంద హనుమకొండ పద్మాక్షి కాలనీలోని జయ నర్సింగ్‌ హోం కళాశాలలో బీఎస్సీ నర్సింగ్‌ రెండో సంవత్సరం చదువుతోంది. మంగళవారం పరీక్ష ఉండగా హాల్‌టికెట్‌ కోసం సోమవారం కళాశాలకు వచ్చింది. 

చీకటి పడటంతో హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చి పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది. కడిపికొండ మీదుగా తన ద్విచక్ర వాహనంపై స్నేహితురాలితో కలిసి బయల్దేరింది. కడిపికొండ గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపానికి చేరుకోగా.. అప్పటికే మాటువేసిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనం నడుపుతున్న యువతిపై యాసిడ్‌ దాడిచేసి పారిపోయారు. కాగా, యువతి ధరించిన హెల్మెట్‌పై నుంచి యాసిడ్‌ కాలిపై పడటంతో స్వల్పంగా గాయపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న మడికొండ పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర ప్రభావం చూపే యాసిడా లేదా బ్యాటరీలో పోసే కెమికలా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 

ప్రేమ వ్యవహారమా, పాత కక్షలా అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, కడిపికొండ గ్రామంలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుల ఆచూకీ తెలియలేదు. పోలీసులు వివిధ దుకాణాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాలు అందుబాటులో ఉంటే నిందితుల ఆచూకీ లభించేది. హనుమకొండలో 2008, డిసెంబర్‌ 10న స్వప్నిక, ప్రణీతపై ముగ్గురు యువకులు యాసిడ్‌ దాడి చేసిన ఘటనను నేటికీ నగరవాసులు మర్చిపోలేదు. సోమవారం చోటుచేసుకున్న యాసిడ్‌ దాడితో నగరం ఉలిక్కిపడింది.   

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)