Breaking News

వృద్ధ దంపతుల దారుణ హత్య

Published on Mon, 05/05/2025 - 07:36

అల్వాల్‌(హైదరాబాద్): వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు నగలతో పాటు, ఇంట్లో ఉన్న నగదు ఎత్తుకెళ్లిన సంఘటన అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సూర్యనగర్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, మాణిక్యారం గ్రామానికి చెందిన కనకయ్య (70), రాజమ్మ (65) దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారికి పెళ్లిళ్లు కావడంతో బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారు. ఊరిలో వ్యవసాయం చేసుకునే కనకయ్య, రాజమ్మ వయసు మీద పడడంతో పిల్లల వద్ద ఉందామనే ఆలోచనతో మూడేళ్ల క్రితం నగరానికి వచ్చారు. కనకయ్య అల్వాల్, సూర్యనగర్‌లో  వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు.

 కొన్నాళ్ల క్రితం అతను అనారోగ్యానికి గురి కావడంతో ఊరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సమీపంలో ఉంటున్న కూతురు లత ఇంటికి వెళ్లి  సామన్లు సర్దుకునేందుకు అవసరమైన సంచులు కూడా తెచ్చుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున వారి కుమార్తె లత ఇంటికి వచ్చి చూడగా తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో మంచంపై విగతజీవులై పడి ఉన్నారు. ఇద్దరి తలలపై గాయాలు ఉన్నాయి. సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. లత కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జాగిలాలను రప్పించి పరిసరాల్లో తనిఖీలు చేశారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. 

గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఇంట్లో చొరబడి దొంగతనాలు పాల్పడి ఉంటారని, ఈ క్రమంలోనే వారిపై దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రాజమ్మ మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, వెండి పట్టీలు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కనకయ్య తమ వద్ద ఉన్న నగదు అవసరమైన వారికి వడ్డీకి ఇచ్చే వాడని తాను ఊరికి వెళ్లి రూ. లక్ష తీసుకువచ్చానని, అవసరం ఉన్న వారికి వడ్డీకి ఇస్తానని చెప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న బాలానగర్‌ డీసీపీ సుధీర్‌ కుమార్, ఏసీపీ రాములు, సీఐ రాహుల్‌దేవ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.    

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)