‘కేనెస్‌’ పెట్టుబడి రూ.2,800 కోట్లు

Published on Sat, 10/07/2023 - 03:43

సాక్షి, హైదరాబాద్‌: సెమీ కండక్టర్ల రంగంలో పేరొందిన ‘కేనెస్‌ టెక్నాలజీ’రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రూ.2,800 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లాలోని కొంగర కలాన్‌లో ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమ ఫాక్స్‌కాన్‌కు పొరుగునే కేనెస్‌ టెక్నాలజీ నూతన తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావుతో కేనెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేశ్‌ కన్నన్, చైర్‌పర్సన్‌ సవితా రమేశ్‌ శుక్రవారం ఇక్కడ భేటీ అయ్యారు.

కొంగరకలాన్‌ యూనిట్‌లో ఔట్‌ సోర్స్‌డ్‌ సెమీ కండక్టర్‌ అసెంబ్లీ టెస్ట్‌(ఓఎస్‌ఏటీ)తోపాటు సంక్షిష్ట సెమీ కండక్టర్ల తయారీ వసతులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. కేనెస్‌ టెక్నాలజీ తన అనుబంధ కేనెస్‌ సెమీకాన్‌ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు విద్యుత్‌ ఉపకరణాలకు అవసరమైన పరికరాలను అందుబాటులోకి తెస్తోంది. ఐఐటీ ముంబై సహకారంతో కేనెస్‌ సెమీకాన్‌ అత్యాధునిక వసతులతో కూడిన పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది.

రాష్ట్రంలో సెమీ కండక్టర్ల వాతావరణాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ ఈవీ నర్సింహారెడ్డి, ఎలక్ట్రానిక్స్‌ విభాగం డైరక్టర్‌ సుజయ్‌ కారంపూరి, కేనెస్‌ సెమీకాన్‌ సీఈవో రఘు ఫణిక్కర్‌ పాల్గొన్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)