Breaking News

సికింద్రాబాద్‌-తిరుపతి ‘వందే భారత్‌’ రైలు ప్రత్యేకతలు, టికెట్‌ ధరలివే!

Published on Fri, 04/07/2023 - 20:59

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌లో శనివారం ఉదయం సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య తొలి వందే భారత్‌ రైలు నడుస్తుండగా.. ఇది రెండోది కానుంది. ఈ సెమీ హైస్పీడ్‌  రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు  స్టేషన్లలో ఆగనుంది. మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు సేవలందిస్తుంది.

సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య నడిచే (20701) రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే, తిరుపతి - సికింద్రాబాద్‌ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. తాజాగా ఈ మార్గంలో టికెట్ల ధరల వివరాలను ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. సికింద్రాబాద్ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్ రూట్లలో టికెట్ల రేట్లలో స్వల్ప వ్యత్యాసం ఉంది.

సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలు

► నిత్యం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఆరు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్
►సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లో 12 గంటల ప్రయాణం
►వందే భారత్ ట్రైన్‌ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.30 గంటల ప్రయాణం
►దేశంలో ఇది 13వ వందే భారత్ ట్రైన్.. ఇందులో 8 కోచ్ లు 530 సీటింగ్ కెపాసిటీ.
►1 ఎగ్జిక్యూటివ్, 7 చైర్ కార్ కోచ్‌లు
►ప్రయాణికుల ఆదరణ దృష్ట్యా కోచ్‌లను పెంచే అవకాశం
►శనివారం ఉదయం 11.30 నుంచి 12.05 లోపు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం
►ఈనెల 9 నుంచి ఉదయం 6 గంటలకు ప్రయాణికులకు అందుబాటులో వందే భారత్ ట్రైన్
►ఈ వందే భారత్ ట్రైన్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు
►సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ చార్జీ 1680, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3080 రూపాయలు
►తిరుపతి నుంచి సికింద్రాబాద్ చైర్ కార్ ఛార్జీ 1625, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3030 రూపాయలు
►వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్ రాకపోక

సికింద్రాబాద్‌ నుంచి ఒక్కో స్టేషన్‌కు ఛార్జీలు ఇలా..

ఛైర్‌ కార్‌
►సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.470
►సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.865
►సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.1075
►సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.1270
►సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.1680

ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌
►సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.900
►సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.1620
►సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.2045
►సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.2455,
►సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.3080
చదవండి: ప్రధాని పర్యటనకు కేసీఆర్‌ వస్తే సన్మానం చేస్తాం: బండి సంజయ్‌

Videos

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)