Breaking News

Hyderabad: టికెట్‌ లేని ప్రయాణం రూ.1.08 కోట్ల జరిమానా

Published on Wed, 10/15/2025 - 09:14

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో టికెట్‌ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారి నుంచి ఒకేరోజు ఏకంగా రూ.కోటికి పైగా మొత్తం జరిమానాగా వసూలు చేశారు. ఒక రోజు జరిపిన తనిఖీలో ఇంతపెద్ద మొత్తం వసూలు కావటం భారతీయ రైల్వేలోనే రికార్డుగా నిలిచింది. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఇతి పాండే ఆదేశం మేరకు.. మంగళవారం జోన్‌లోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్‌ డివిజన్‌లలో సిబ్బంది విస్తృత తనిఖీలు జరిపారు.

 టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న వారిని గుర్తించి 16,105 కేసులు నమోదు చేసి జరిమానాగా రూ.1.08 కోట్లను వసూలు చేశారు. ఈనెల 6న జరిపిన తనిఖీల్లో రూ.92.4 లక్షలు జరిమానాగా వసూలు చేశారు. ఇప్పటి వరకు అదే అత్యధికం. మంగళవారం వసూలు చేసిన జరిమానా మొత్తం భారతీయ రైల్వేలోనే ఒకరోజు గరిష్టం కావటం విశేషం. విజయవాడ డివిజన్‌ పరిధిలో అత్యధికంగా రూ.36.91 లక్షలు, గుంతకల్లు డివిజన్లో రూ.28 లక్షలు, సికింద్రాబాద్‌ డివిజన్లో రూ.27.9 లక్షలు, గుంటూరు డివిజన్లో రూ.6.46 లక్షలు, హైదరాబాద్‌ డివిజన్లో రూ.4.6 లక్షలు, నాందేడ్‌ డివిజన్లో రూ.4.08 లక్షల చొప్పున జరిమానా వసూలైంది.   

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)