Breaking News

బడుల్లో బురద మేట

Published on Tue, 09/03/2024 - 02:29

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు ప్రభుత్వ విద్యాసంస్థలను ముంచెత్తాయి. పలు జిల్లాల్లోని పాఠశాలల్లో బురద మేటలు వేసింది. కొన్నిచోట్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల రికార్డులు తడిసి ముద్దవగా ఇంకొన్ని చోట్ల వరదలో రికార్డులు కొట్టుకుపోయాయి. ఖమ్మం పట్టణంలోని దాదాపు అన్ని స్కూళ్లకు వరద తీవ్రత ఎక్కువగా ఉంది. వర్షం తీవ్రత తగ్గినా వారంపాటు సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు డీఈవోలను ఆదేశించారు. 

అన్ని చోట్లా అదే పరిస్థితి 
ఖమ్మం నయాబజార్‌ ప్రభుత్వ పాఠశాల మున్నే రుకు సమీపంలో ఉంటుంది. మున్నేరు ఉప్పొంగడంతో నీరంతా స్కూల్‌ను ముంచెత్తింది. ఆది వారం రాత్రి స్కూల్లోకి మోకాళ్లలోతు వరకు వర ద చేరినట్లు స్థానికులు చెప్పారు. దీంతో అడ్మినిస్ట్రేషన్‌ రూంలోని పలు రికార్డులు కొట్టుకుపోయినట్టు స్కూల్‌ టీచర్‌ ఒకరు పేర్కొన్నారు. 

నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండల కేంద్రంలోని సాయిమాధవ నగర్‌ కాలనీలోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాల పూర్తిగా జలదిగ్బంధమైంది. – హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి ప్రభుత్వ పాఠశాల చుట్టూ వరద చేరింది. గదుల్లోనూ వరదనీరు ఉండటంతో కొన్ని రోజులపాటు క్లాసుల నిర్వహణ కష్టమని టీచర్లు అంటున్నారు.   

మెదక్‌ జిల్లా కొల్చారం మండలం రంగంపేట ఉన్నత పాఠశాల ముందు వరదనీరు నిలిచింది. తరగతి గదుల్లోని గోడలకు చెమ్మ ఏర్పడింది. సాధారణ పరిస్థితి వచ్చే దాకా క్లాసులు నిర్వహించడం కష్టమేనని ఉపాధ్యాయులు అంటున్నారు. క్లాసులు నిర్వహించినా కొన్ని రోజులపాటు విద్యార్థులు హాజరుకావడం కష్టమేనని స్థానికులు చెబుతున్నారు.  

సూర్యాపేట జిల్లాలోని పలు స్కూళ్లలోకి వరద తగ్గినా బురద కొన్ని రోజులు ఉండే వీలుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు తరగతుల నిర్వహణ కష్టమని టీచర్లు అంటున్నారు.

ఇంజనీరింగ్‌ స్పాట్‌కు మరోరోజు గడువు పెంపు
వరదలు ముంచెత్తిన నేపథ్యంలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియను మరోరోజు పొడిగించాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి సోమవారంతో స్పాట్‌ ముగించాల్సి ఉంది. ఇప్పటివరకు 2 వేల మంది విద్యార్థులు స్పాట్‌ అడ్మిషన్లు పొందారు. కొన్నిచోట్ల రహదారులు తెగిపోవడంతో విద్యార్థులు కాలేజీలకు రాలేని పరిస్థితి ఉన్నట్లు అధికారుల దృష్టికి తెచ్చారు. మరోవైపు ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో జరగాల్సిన పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు