Breaking News

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఇంకెప్పుడు?

Published on Fri, 01/31/2025 - 12:41

న్యూఢిల్లీ, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో.. తెలంగాణ స్పీకర్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటారంటూ ప్రశ్నించింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం, దానం నాగేందర్ , తెల్ల వెంకటరావులపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, వివేకానందలు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 

విచారణ సందర్భంగా.. చర్యలకు అసెంబ్లీ స్పీకర్‌కు ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకు ఆయన.. తగిన సమయం రావాలని అన్నారు. దీంతో.. ‘‘ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ?. రీజనబుల్ టైం అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా ?..’’ అని తెలంగాణ స్పీకర్‌ను ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయమై స్పీకర్‌ను సంప్రదించి చెబుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గి సమాధానం ఇచ్చారు. దీంతో విచారణను వచ్చేవారానికి వాయిదా పడింది.   

బీఆర్‌ఎస్‌పై గెలిచి.. ఈ ముగ్గురితో సహా మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. అయితే.. పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జనవరి 16వ తేదీన SLP దాఖలు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్‌ ఇప్పటిదాకా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని హరీష్‌రావు మరో పిటిషన్‌ వేశారు.

మహారాష్ట్ర కేసులో..
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌.. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీకి మారిన(ఫిరాయించిన) నేతలపై అనర్హత వేటు వేయడం గురించి ప్రత్యేక చట్టంతో చర్చించింది. అయితే దానికి ఓ నిర్దిష్ట కాలపరిమితి అంటూ లేకపోవడంతో.. ఇలాంటి కేసుల్లో చర్యలకు ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే గతంలో మహారాష్ట్రలో ఫిరాయింపుల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది.  2022 జనవరిలో పార్టీ ఫిరాయించిన మహారాష్ట్ర ఎమ్మెల్యేలపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని, వాళ్ల పదవీకాలం ముగిసేదాకా ఆగాలని సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు వెలువరించింది.

రాజ్యాంగపరంగా ఎలాంటి సంక్షోభాలు తలెత్తకుండా, చట్ట సభలు సజావుగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం ఆ సమయంలో వ్యాఖ్యానించింది. అంతేకాదు.. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం  ఫిరాయింపుల కేసుల్లో పారదర్శకత కోసం నిర్దిష్ట మార్గదర్శకాల ఆవశ్యకతను తెలియజేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)