Breaking News

ప్రాణాలతో బతికి బయట పడ్డాడు.. కానీ ఇంకా షాక్‌లోనే..!

Published on Tue, 11/18/2025 - 18:42

సౌదీ అరేబియా మదీనా సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 45 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు సజీవ దహనమైన తెలిసిందే. మృతుల్లో అత్యధికంగా తెలంగాణ హైదరాబాద్‌కు చెందినవాళ్లే ఉన్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్ షోయబ్ అనే యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం నుంచి బయటపడిన ఏకైక వ్యక్తి అతనే.

అతను ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన బస్సు డ్రైవర్‌తో పాటు అతను బయటపడ్డాడు,. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అతను కిందకు పడిపోవడంతోనే అతను సురక్షితంగా బయటపడ్డాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్న షోయబ్‌.. ఇంకా షాక్‌లోనే ఉన్నాడు. బస్సు ప్రమాదం జరిగి అగ్ని గోళంగా మారిపోవడంతో  ఇంకా ఆ షాక్‌ నుంచి తేరుకోలేదు. తన కళ్లు ముందు బస్సు అగ్ని ఆహుతి కావడంతో అలా చూస్తూ ఉండిపోయాడు తప్ప చేసేదేమీ లేకుండా పోయింది.

హైదరాబాద్‌ అసిఫ్‌ నగర్‌, హబీబ్‌ నగర్‌కు చెందిన 44 మంది మక్కా యాత్ర కోసం అల్‌ మక్కా, ఫ్లై జోన్‌ ట్రావెల్స్‌ నుంచి టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీన వాళ్లు అక్కడికి వెళ్లారు. మొత్తం 46 మంది ప్రయాణికులతో కూడిన బస్సు మక్కా యాత్ర తర్వాత గత రాత్రి మదీనాకు వెళ్తోంది. వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంలో షోయబ్‌ మినహా అందరూ మరణించడం తీవ్ర విషాదం నెలకొంది. 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)