Breaking News

ఇక పడేదంతా బోనస్సే

Published on Thu, 09/04/2025 - 04:38

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షాలు సంతృప్తికర స్థాయిలో నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు కురవాల్సిన సగటు సాధారణ వర్షపాతానికి మించి వానలు పడ్డాయి. అయితే ఈ సీజన్‌ సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంది కాబట్టి.. ఇకపై కురిసే వర్షాలు అదనమేనని, వర్షాలు కురిస్తే సగటు సాధారణ వర్షపాతాన్ని మించి నమోదైనట్టేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

జూన్‌ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతుపవనాల సీజన్‌ కాగా.. ఈ 4 నెలల కాలంలో రాష్ట్రంలో 74.06 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. సెప్టెంబర్‌ 2వ తేదీ నాటికి 59.30 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా,... ఏకంగా 75.75 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సగటు వర్షపాతం కంటే 28 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 

ఆరు జిల్లాల్లో అత్యధిక వర్షాలు 
∙ప్రస్తుత సీజన్‌లో రాష్ట్రంలోని 6 జిల్లాల్లో అత్యధిక వర్షాలు నమోదయ్యాయి. 14 జిల్లాల్లో అధిక వర్షపాతం, 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 60 రోజులు వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 55, ములుగులో 51 రోజుల పాటు వర్షాలు కురిశాయి. 

నిర్మల్‌లో 48, వరంగల్‌లో 47, మహబూబాబాద్‌లో 44, మెదక్, సంగా రెడ్డి జిల్లాలో 43 రోజుల పాటు వర్షాలు కురిశాయి. నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లో 42 రోజులు చొప్పున, కామారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, ఖమ్మం జిల్లాల్లో 41 రోజుల చొప్పున వర్షాలు కురిశాయి. మండలాల వారీగా వర్షపాతాన్ని పరిశీలిస్తే..119 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 271 మండలాల్లో అధిక వర్షపాతం, 218 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 

13 మండలాల్లో మాత్రం ఇంకా లోటు ఉంది. సీజన్‌ ముగిసే నాటికి ఈ మండలాల్లో కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు. సెపె్టంబర్‌లో రాష్ట్రంలో సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే అంచనాలు విడుదల చేసింది.

» అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలు: మెదక్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, కామారెడ్డి 
» అధిక వర్షపాతం నమోదైన జిల్లాలు : సిద్దిపేట, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, హైదరాబాద్, నల్లగొండ, మేడ్చల్‌–మల్కాజిగిరి, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్‌ 
» సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు: ములుగు, మహబూబా బాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జనగామ, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, హనుమకొండ, పెద్దపల్లి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)