Breaking News

అప్సర కేసులో సాయికృష్ణకి జీవితఖైదు

Published on Wed, 03/26/2025 - 12:29

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్ల కిందట తీవ్ర చర్చనీయాంశమైన అప్సర కేసు(Apsara Case)లో సంచలన తీర్పు వెలువడింది. సాయికృష్ణను దోషిగా నిర్ధారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతేకాదు.. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడు సంవత్సరాల అదనపు జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించింది. 

2023 జూన్‌లో శంషాబాద్‌లో జరిగిన అప్సర హత్య కేసు సంచలనం సృష్టించింది. సరూర్‌ నగర్‌లో స్థానికంగా ఓ ఆలయంలో పూజారి అయిన సాయికృష్ణ(Sai Krishna)కు.. అప్సరతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. నాలుగేళ్లుగా వాళ్ల బంధం కొనసాగింది. చివరకు పెళ్లి చేసుకోవాలంటూ ఆమె అతడిపై ఒత్తిడి తెచ్చింది. అయితే.. 

విషయం బయటపడితే తన పరువు పోతుందనే భయంతో ఆమెను పక్కా ప్రణాళిక వేసి సాయికృష్ణ హతమార్చాడు. ఆపై శంషాబాద్‌ నుంచి మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి.. మ్యాన్‌హోల్‌లో వేసి పూడ్చేశాడు. ఆపై ఏమీ తెలియనట్టు ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడే నిందితుడని గుర్తించిన విషయం తెలిసిందే.  

సినిమా అవకాశాల పేరుతో.. 
చెన్నైకి చెందిన అప్సర కుటుంబం.. హైదారాబాద్‌కు వలస వచ్చింది. అప్పటికే అప్సర డైవోర్సీ. ఆమె తండ్రి కాశీలో స్థిరపడిపోగా.. తల్లితో కలిసి సరూర్‌నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు దిగింది. ఈ క్రమంలో ఇంటి దగ్గర గుడిలో పెద్దపూజారిగా పని చేస్తున్న సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. శంషాబాద్‌లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు సాయి. ఈ క్రమంలో సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు. 

అప్సర తల్లి(Apsara Mother)ని అక్కా.. అని పిలుస్తూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. వివాహితుడు అని తెలిసి కూడా అప్సర అతనితో చనువుగా ఉంటూ వచ్చింది. ఆ పరిచయం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్‌ సైతం చేయించాడు.  చివరకు పెళ్లి కోసం ఒత్తిడి చేయడాన్ని టార్చర్‌గా భావించి అప్సరను శంషాబాద్‌ వైపు తీసుకెళ్లి హత్య చేశాడు. 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)