Breaking News

ప్రమాణం చేయకుండానే సర్పంచ్‌ మృతి

Published on Thu, 12/25/2025 - 07:17

న్యాల్‌కల్‌ (జహీరాబాద్‌): సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలంలోని మిర్జాపూర్‌ (ఎన్‌) గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన ఎర్రోళ్ల అక్కమ్మ బుధవారం రాత్రి మృతి చెందారు. ఇటీవల నిర్వహించిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అక్కమ్మ (58) కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో విజయం సాధించారు. అయితే ఆమె కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పదవీ ప్రమాణం చేయలేకపోయారు. కాగా, పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో మిర్జాపూర్‌ (ఎన్‌) గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్కమ్మ సర్పంచ్‌గా గెలిచారన్న సంతోషంలో ఉన్న ఆ కుటుంబం ఆమె మరణంతో విషాదంలో మునిగిపోయింది.

ఓటేయలేదని బెదిరింపులు.. యువకుడి ఆత్మహత్య
శంకర్‌పల్లి: ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని బెదిరించడంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగా రెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో బుధవారం జరిగిన ఈ సంఘటనపై మోకిల సీఐ వీరబాబు, మృతుని తల్లి పద్మ తెలిపిన వివరాలివి. గోపులారం గ్రామానికి చెందిన వెంకటేశ్, పద్మలకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు అనిల్‌ (28).. దొంతాన్‌పల్లిలోని ఇక్ఫాయ్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో చీర సాయికుమార్‌ అనే వ్యక్తి సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 

తనకు మద్దతు తెల పలేదంటూ మంగళవారం రాత్రి అనుచరులతో కలిసి అనిల్‌ను బెదిరించా డు. దీంతో మనస్తాపానికి గురైన అనిల్‌ ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పా డు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనిల్‌ బెదిరింపుల వల్లే తన కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)