Breaking News

హైదరాబాద్‌ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సందీప్‌ శాండిల్య

Published on Fri, 10/13/2023 - 17:08

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర కమిషనర్‌గా సందీప్‌ శాండిల్య బాధ్యతలు చేపట్టారు. ఆయన్ని సీపీగా నియమిస్తూ తెలంగాణ సీఎస్‌ శాంతికుమారి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఆయన శనివారం బాధ్యతలు స్వీకరిస్తారని పోలీస్‌ శాఖ ప్రకటించింది. అయితే.. ఉత్తర్వులు వెలువడిన గంటల వ్యవధిలోనే ఆయన బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.

ఢిల్లీకి చెందిన సందీప్‌ శాండిల్య.. ఇంతకు ముందు పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. గతంలో సైబరాబాద్‌ సీపీగా, రైల్వే అడిషనల్ డీజీగా విధులు నిర్వహించారు. 

సంతోషంగా ఉంది.. 
హైదరాబాద్‌ నగర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని సందీప్‌ శాండిల్య అన్నారు. ‘‘ఎలక్షన్ కమీషన్ ఇచ్చిన బాధ్యత ను సక్రమంగా నిర్వహిస్తాం. టెక్నాలజీకి తగ్గట్టుగా పని చేస్తాం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహిస్తాం’’ అని తెలిపారాయన. 

గుంటూరులో ఫస్ట్‌ పోస్టింగ్‌
1993 ఐపీఎస్‌ బ్యాచ్‌కి చెందిన సందీప్ శాండిల్య గుంటూరులో మొదటి పోస్టింగ్ పొందారు. నల్గొండ, ఆదిలాబాద్, కృష్ణా, సౌత్ జోన్, డీసీపీగా చేశారు. సీఐడీ, ఇంటిలిజెంట్ సెక్యూరిటీ వింగ్‌లో, అడిషనల్ పోలీస్ కమిషనర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. 2016 నుంచి 2018 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. అడిషనల్ డీజీ రైల్వే అండ్ రోడ్ సేఫ్టీగా విధులు నిర్వహించిన శాండిల్య.. జైళ్ల శాఖ డీజీగానూ మూడు నెలల పాటు పనిచేశారు.

కాగా, రానున్న తెలంగాణా ఎ‍న్నికల నేపథ్యంలో రాష్ట్రంలో  ఈసీ  ఏకంగా 20 మంది ఉన్నతస్థాయి అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ సహా నలుగురు జిల్లాల కలెక్టర్లు, 13 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు పూర్తిస్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీల నివేదికను పంపించాలని కోరింది. ఈ మేరకు ప్రతిపాదిక జాబితా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఈసీకి పంపగా ఇందులోని పలువురి పేర్లను ఖరారు చేసింది.

తెలంగాణా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బ‌దిలీకి సంబంధించి అన్ని పోస్టుల నియామకాలపై ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. పది జిల్లాలకు కొత్త ఎస్పీలు, వరంగల్‌, నిజమాబాద్‌కు కొత్త కమిషనర్ల నియామకం జరిగింది.

యాదాద్రి క‌లెక్ట‌ర్‌గా హ‌నుమంత్, నిర్మ‌ల్ క‌లెక్ట‌ర్‌గా ఆశీష్ సంగ్వాన్, రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌గా భార‌తీ హోలీకేరి, మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్‌గా గౌతం, ర‌వాణా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా వాణీ ప్ర‌సాద్, ఎక్సైజ్, వాణిజ్య ప‌న్నుల శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా సునీల్ శ‌ర్మ‌, ఎక్సైజ్ క‌మిష‌న‌ర్‌గా జ్యోతి బుద్ధ ప్ర‌కాశ్‌, వాణిజ్య ప‌న్నుల శాఖ క‌మిష‌న‌ర్‌గా క్రిస్టినా  నియమితులయ్యారు. అలాగే వరంగల్ కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా , నిజామాబాద్‌ కమిషనర్‌గా క‌ల్మేశ్వ‌ర్‌ని ఎంపిక చేశారు.

పోలీసు క‌మిష‌న‌ర్లు, ఎస్పీల జాబితా వివరాలు 
►సంగారెడ్డి - చెన్నూరి రూపేష్
►కామారెడ్డి- సింధు శర్మ
►జగిత్యాల- సన్‌ప్రీత్ సింగ్
►మహబూబ్ నగర్ - హర్షవర్ధన్
►నాగర్ కర్నూల్- గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
►జోగులాంబ గద్వాల్- రితిరాజ్
►మహబూబాద్ - డాక్టర్ పాటిల్ సంగ్రామ్
►నారాయణపేట - యోగేష్ గౌతమ్
►జయశంకర్ భూపాలపల్లి - ఖరే కిరణ్ ప్రభాకర్
►సూర్యాపేట-  బీకే రాహుల్ హెగ్డే

►వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌ర్-అంబ‌ర్ కిషోర్ ఝా
►నిజామాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ -కల్మేశ్వ‌ర్ సింగేనేవ‌ర్
చదవండి: కాంగ్రెస్‌ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)