Breaking News

ఒకే కులం పెళ్లిళ్లతోనూ వ్యాధులు

Published on Wed, 03/05/2025 - 17:56

సాక్షి, హైదరాబాద్‌: ‘బంధువుల అమ్మాయే. అన్నీ కుదిరాయి. అందుకే చేసుకుంటున్నాం.. మా కులపువాళ్లే. అమ్మాయి బాగుంటుంది. సంబంధం ఖాయం చేశాం.. పెళ్లిళ్ల విషయంలో ఈ రకమైన మాటలు తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ రకంగా దగ్గరి చుట్టాలు, ఒకే కులంలో పెళ్లిళ్ల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు. కొన్ని కులాల వారికి కొన్ని రకాల వ్యాధులు వారసత్వంగా వస్తాయని గతంలో జరిగిన పరిశోధనల్లో తేలింది. సీసీఎంబీ (CCMB) శాస్త్రవేత్త డాక్టర్‌ కె.తంగరాజ్‌ బృందం ఇటీవల నిర్వహించిన అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది.

ఒకే కులం (Same Caste)లో ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవడం (కులాలతో పాటు చిన్నచిన్న సమూహాలకు కూడా ఇది వర్తిస్తుంది) వల్లనే ఆయా కులాల వారికి కొన్ని రకాల జబ్బులు వారసత్వంగా వస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. నాలుగు వేర్వేరు సమూహాలకు చెందిన 281 మంది జన్యు క్రమాలను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చినట్టు తంగరాజ్‌ తెలిపారు. జబ్బులకు వాడే మందులు కొన్ని సమూహాల్లో ఎందుకు భిన్నమైన ప్రభావం చూపుతాయనే అంశాన్ని కూడా పరిశీలించామని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రతీసా మచ్చ తెలిపారు.

కీళ్లు, వెన్ను, లిగ్మెంట్లలో వాపు/మంటకు కారణమయ్యే స్పాండిలైటిస్‌కు ఒక నిర్దిష్ట జన్యుపరమైన మార్పుతో సంబంధం ఉందని చెప్పారు. HLA& B27:04 అని పిలిచే ఈ జన్యు మార్పు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రాంతంలో ఒక సామాజికవర్గం వాళ్లలో ఈ స్పాండిలైటిస్‌ (spondylitis) ఎక్కువగా ఉందని గుర్తించినట్లు కిమ్స్‌ ఆసుపత్రి (KIMS Hospital) రుమటాలజిస్ట్‌ డాక్టర్‌ శరత్‌ చంద్రమౌళి వీరవల్లి వెల్లడించారు. కొన్ని కులాలు, సమూహాలకే ప్రత్యేకమైన వ్యాధుల జన్యు రూపాంతరాలను కూడా గుర్తించినట్లు వివరించారు. ఆయా సమూహాల్లోని వారు ఈ వ్యాధులకు వాడే ఔషధాలు ఇతరులలో కంటే భిన్నంగా పని చేస్తాయని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్‌ దివ్య తేజ్‌ పేర్కొన్నారు.   

చ‌ద‌వండి: పాపం శిరీష‌.. ఆడ‌ప‌డుచు క‌ప‌ట ప్రేమ‌కాటుకు బ‌లైంది

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)