Breaking News

బీఆర్‌ఎస్‌ నేతలకూ రుణమాఫీ!!

Published on Sat, 08/17/2024 - 18:44

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీపై తీవ్ర చర్చ నడుస్తోంది. రుణమాఫీ చేసినట్టు హస్తం పార్టీ నేతలు చెబుతుండగా.. అర్హులకు మాఫీ కాలేదని, అసలు డబ్బులే ఇవ్వలేదని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్‌ఎస్‌ నేతలకు కూడా రుణాలు మాఫీ కావడం ఆసక్తికరంగా మారింది.

కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీ చేసిన వారిలో కొందరు బీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఉన్నారు. వారిలో మాజీ మంత్రి జోగు రామన్న, గంప గోవర్ధన్‌, బొడిగే గాలేయ్య, బిగాల గణేష్‌, పాయల్‌ శంకర్‌, దుర్గం అశోక్‌, హర్ష్‌ పటేల్‌ గుప్తా వంటి నేతలు ఉన్నారు. వీరిలో లక్షల్లో రుణాలు మాఫీ జరిగినట్టు సమాచారం. వీరి ఖాతాల్లో డబ్బులు జమ అయినట్టు తెలుస్తోంది.

వీరికి రుణమాఫీ ఇలా.. 

  • హర్ష్‌ పటేల్‌ గుప్తా: లక్షా 60వేలు

  • జోగు రామన్న: లక్షా ఆరు వేలు

  • గంప గోవర్ధన్‌: లక్షా 51వేలు

  • దుర్గం అశోక్‌: 81వేలు


ఇదిలా ఉండగా.. రుణమాఫీపై కాంగ్రెస్‌ నేతలకు ప్రతిపక్ష పార్టీల నేతలు సవాల్‌ విసురుతున్నారు. రుణమాఫీ జరిగనట్టు ఎవరైనా చెబితే తాము వెంటనే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటామని బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక, తాజాగా బీఆర్‌ఎస్‌ నేతల ఖాతాల్లో కూడా డబ్బులు జమ కావడంతో మిగతా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)