Breaking News

మార్చి 13లోగా డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మె

Published on Wed, 02/25/2026 - 03:03

కవాడిగూడ: దీర్ఘకాలిక పెండింగ్‌ సమస్యలను మార్చి 13లోగా సీఎం రేవంత్‌రెడ్డి పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడించి సమ్మెకు దిగుతామని టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు. చలో సచివాలయం ముట్టడి కార్యక్రమంలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరా పార్కు ధర్నాచౌక్‌లో ఆర్టీసీ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్మాకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మద్దతు పలికారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల కంటే ఆర్టీసీ కార్మికులకు తక్కువ వేతనం ఉందని.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థిక భారంలేని బెనిఫిట్లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ చైర్మన్‌ ఈదురు వెంకన్న మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న ప్రక్రియను సీఎం రెండేళ్లయినా మొదలుపెట్టలేదన్నారు. 

మార్చి 13లోగా డిమాండ్లను పరిష్కరించకుంటే మార్చి 18 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. జేఏసీ వైస్‌ చైర్మన్‌ థామస్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక 2017 వేతన సవరణ అమలు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అందుకు సంబంధించిన ఎరియర్స్‌ను మాత్రం ఇంకా చెల్లించలేదన్నారు. ఆర్టీసీకి రా వాల్సిన రూ. 2,150 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో  ఎండి మౌలానా, యాద య్య,  సురేశ్,  యాదగిరి, కరుణాకర్‌గౌడ్, యాదయ్య, రా ఘవులు, బాల్‌రెడ్డి, బాబు, ఆర్టీసీ కారి్మకులు పాల్గొన్నారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)