Breaking News

లక్షలాది జనం.. రవాణా ఘోరం

Published on Wed, 02/12/2025 - 03:52

సాక్షి, హైదరాబాద్‌: ఆధ్యాత్మిక యాత్ర విషాదభరితంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌ మహాకుంభమేళాకు తరలి వెళ్తున్నారు. కానీ డిమాండ్‌ మేరకు రైళ్లు అందుబాటులో లేవు. ఇటు తెలంగాణ ఆర్టీసీ కానీ, అటు ఏపీఎస్‌ఆర్టీసీ కానీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయలేదు. భక్తులు మధ్యతరగతి, సామాన్యప్రజలకు ఏ మాత్రం అందనంతగా విమానచార్జీలు భారీగా పెరిగాయి. 

ఈ నేపథ్యంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి రావాలని కోరుకుంటున్న జనం తోచిన మార్గంలో వెళ్తున్నారు. సామర్థ్యం లేని ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణం చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. నాచారం (హైదరాబాద్‌) నుంచి యూపీ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాకు మినీబస్సులో వెళ్లిన ఏడుగురు భక్తులు తిరుగు ప్రయాణంలో లారీ ఢీకొని మరణించిన ఉదంతం ఆందోళన రేపుతోంది. 

ప్రయాణికుల రద్దీ కారణంగా ఒకవైపు రహదారులు వందలకొద్దీ కిలోమీటర్లతో కిక్కిరిసిపోతుండగా, మరోవైపు మినీబస్సులు, మ్యాక్సీక్యాబ్‌లు వంటి చిన్న వాహనాల్లో ఎక్కువమంది ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. 

అరకొర రైళ్లు...: ప్రయాణికుల రద్దీ మేరకు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కానీ అరకొర రైళ్లు అందుబాటులో ఉన్నాయి. పైగా సికింద్రాబాద్‌ నుంచి పట్నా, దానాపూర్, గోరఖ్‌పూర్, లక్నో, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్‌ రైళ్లలో జనవరి నాటికే బుకింగ్‌ నిలిచిపోయింది. వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ వెయిటింగ్‌ లిస్టు 200 దాటింది. 

మరిన్ని అదనపు రైళ్లు నడిపితే తప్ప తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు ప్రయాణం చేయడం సాధ్యం కాదు. సాధారణంగా సంక్రాంతి, దసరా వంటి పండుగలు, మేడారం వంటి జాతరలకు ఆర్టీసీ వేలకొద్దీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. కానీ ఈ కుంభమేళాకు లక్షలాది మంది తరలి వెళ్తున్నట్లు తెలిసి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయకపోవడం శోచనీయం.

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిలువుదోపిడీ
ప్రతిసారీ పండుగ ప్రయాణాన్ని సొమ్ము చేసుకొనే ప్రైవేట్‌ ట్రావెల్స్, టూరిస్ట్‌ సంస్థలు మహాకుంభమేళా భక్తులను కూడా వదలకుండా నిలువుదోపిడీకి పాల్పడు­తున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఫిట్‌నెస్‌ ఉన్నా లేకున్నా పెద్దఎత్తున వాహనాలను నడుపుతు­న్నాయి. 

30 నుంచి 40 మంది ప్రయాణం చేసే ప్రైవేట్‌ బస్సులతోపాటు, 14 నుంచి 20 మంది వరకు ప్రయా­ణం చేసే సామర్థ్యం ఉన్న మినీ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌­లు, ఇతరత్రా వాహనాలను ఎడాపెడా రోడ్డెక్కిస్తు­న్నా­యి. ప్యాకేజీల పేరుతో ఒక్కో ప్రయాణికుడి వద్ద రూ. 25,000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణంగా సుదీర్ఘమైన ప్రయాణం చేసే వాహనాల్లో ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలి. 

ప్రతి 8 గంటలకు ఒకసారి విధులు మార్చుకోవాలి. కానీ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న వాహనాలు చాలావరకు ఒక డ్రైవర్‌తోనే బయలు­దే­రుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌ వరకు సుమారు 1,136 కి.మీ. దూరం నిరాటంకంగా వాహనా­లను నడపడం వల్ల డ్రైవర్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)