Breaking News

హైదరాబాద్‌ మెట్రో విస్తరణ: ఏయే రూట్‌లో అంటే..

Published on Tue, 01/23/2024 - 04:44

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పెరిగిన ట్రాఫిక్‌ రద్దీని నివారించడంతోపాటు భవిష్యత్‌ రవాణా అవసరాలను, ఎయిర్‌పోర్టు కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకొని మెట్రోరైలు రెండో దశ ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు 70 కిలోమీటర్ల పొడవుతో రూపొందించిన ఫేజ్‌–2 మెట్రో రూట్‌మ్యాప్‌ను ఖరారుచేశారు. రెండో కారిడార్‌ పొడిగింపుతోపాటు నాలుగు కొత్త కారిడార్లు కలిపి కొత్త రూట్‌మ్యాప్‌ను రూపొందించారు. దీనికి ప్రభుత్వపరంగా ఆమోదముద్ర పడితే తదుపరి ప్రక్రియ మొదలవుతుందని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం రూపొందించిన విస్తరణ ప్రణాళికలను పక్కనబెట్టి, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో కనెక్టివిటీ రీచ్‌ అయ్యేలా కొత్త రూట్‌ను డిజైన్‌ చేశారు. హైదరాబాద్‌ పాత నగరంతోపాటు కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉండేలా రూపొందించడం విశేషం.  

రెండోదశ మెట్రో రూట్‌ మ్యాప్‌ ఇదీ... 
హైదరాబాద్‌ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కి.మీ. మేర అందుబాటులో ఉంది. మియాపూర్‌ టు ఎల్బీ నగర్, జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్, నాగోల్‌ టు రాయదుర్గం వరకు కనెక్టివిటీ ఉంది. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకున్న రెండో కారిడార్‌ను ఫేజ్‌–1లో ప్రతిపాదించిన ఫలక్‌నుమా వరకు పొడిగించి, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్‌ వరకు మొత్తంగా 7 కి.మీ. పొడిగించాలని కొత్త రూట్‌మ్యాప్‌లో ప్రతిపాదించారు.  

కారిడార్‌ 4: నాగోల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఎల్బీ నగర్‌ మెట్రో స్టేషన్‌ వరకు, అక్కణ్నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌ రోడ్డు, మైలార్‌దేవ్‌ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు (మొత్తం 29 కి.మీ.), అలాగే మైలార్‌దేవ్‌ పల్లి నుంచి ఆరాంఘర్‌ మీదుగా రాజేంద్రనగర్‌లో ప్రతిపాదించిన హైకోర్టు వరకు (4 కి.మీ.) ఉంటుంది.  

కారిడార్‌ 5: రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్‌ రామ్‌ గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్‌ కాన్సులేట్‌ (ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌) వరకు (8 కి.మీ.) 

కారిడార్‌ 6:  మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ మీదుగా పటాన్‌చెరు వరకు (14 కి.మీ.) 

కారిడార్‌ 7: ఎల్బీ నగర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి వనస్థలిపురం, హయత్‌ నగర్‌ వరకు (8 కి.మీ.)

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)