కళ్లల్లో కారం కొట్టి.. కత్తులతో బెదిరించి..హైదరాబాద్‌లో దారిదోపిడీ..

Published on Fri, 09/12/2025 - 17:24

సాక్షి,హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో దారిదోపిడీ కలకలం రేపుతోంది.

హైదరాబాద్‌కు చెందిన స్టీలు వ్యాపారి రాకేష్‌ అగర్వాల్‌.. తన కారు డ్రైవర్‌..వ్యాపార భాగస్వామిని వికారాబాద్‌ నుంచి రూ.40లక్షల నగదు తీసుకుని రావాలని పురమాయించారు.అయితే, కారు డ్రైవర్‌,పార్టనర్‌ ఇద్దరు కలిసి వికారాబాద్‌ నుంచి రూ.40లక్షల నగదు తీసుకుని శంకర్‌పల్లి మీదిగా కీసర బయల్దేరారు. శంకర్‌పల్లి మండలం పర్వేడ వద్దకు రాగానే.. ఆ కారును వెనుక నుంచి ఓ స్విప్ట్‌ వాహనం ఢీకొట్టింది.

వెంటనే మెరుపు వేగంతో రాకేష్‌ అగర్వాల్‌ మనుషులపై కారంపొడి చల్లి, నకిలీ గన్నుతో బెదిరించారు. రూ40లక్షలు తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ కొత్తపల్లి గ్రామం వద్ద నిందితుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.  వాహనం బోల్తా పడడంతో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్థానికులు నిందితుల్ని ప్రశ్నించడంతో భయాందోళనకు గురైన నిందితులు రూ.40లక్షల నగదులో కొంతమొత్తాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు.

దోచుకున్న మొత్తాన్నికారులో వదిలేసి పారిపోయారు. వాహనం బోల్తాపై సమాచారం అందుకున్న శంకర్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.స్పాట్‌లో రూ.8లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దోపిడికి వినియోగించిన పిస్తోల్‌ డమ్మీదని గుర్తించారు. నెంబర్‌ ప్లేటుకూడా డమ్మీదని తేల్చారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్‌ అగర్వాల్‌ మనుషులు రూ.40లక్షల తీసుకువస్తున్నారని దుండగులకు ఎవరు సమాచారం ఇచ్చారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)