Breaking News

వరంగల్‌: బైక్‌పై నలుగురు.. ప్రమాదంలో అక్కడికక్కడే మృతి

Published on Thu, 04/25/2024 - 18:36

సాక్షి, వరంగల్‌: నలుగురు యువకుల ప్రాణాలను బస్సు రూపంలో మృత్యువు కబలించింది. నిర్లక్ష్యపు ప్రయాణానికి నాలుగు ప్రాణాలు గాల్లో కలిసాయి. వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకున్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ హృదయ విదారకఘటన వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది.

వర్ధన్నపేట నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సును ఇల్లందు నుంచి వర్ధన్నపేట వైపు వస్తున్న ద్విచక్రవాహనం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా. మరో యువకుడు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతులు వరుణ్ తేజ(18), సిద్దు(18),గణేష్(18), రనిల్ కుమార్(18) లుగా పోలీసులు గుర్తించారు.

నలుగురు యువకులు స్నేహితులు, ప్రమాద సమయంలో ఒక్క ద్విచక్ర వాహనంపై నలుగురు యువకులు ప్రయాణించారు.  మృతులు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందినవారు కాగా యువకుల మృతితో వారి కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతంగా మారగా ఇల్లంద గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)