Breaking News

ఔటర్‌పై ఆగిఉన్న లారీని ఢీకొన్న స్విఫ్ట్‌

Published on Wed, 07/29/2026 - 09:15

హైదరాబాద్: ఓఆర్‌ఆర్‌పై ఆగిఉన్న సిమెంట్‌ లారీని ఢీకొట్టడంతో స్విఫ్ట్‌ కారులోని యువకుడితో పాటు ఓ యువతి దుర్మరణం చెందిన ఘటన గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కె.సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. 

యాదాద్రి– భువనగిరి జిల్లా బొమ్మలరామారం మరియాల గ్రామానికి చెందిన కత్రావత్‌ సురేందర్‌ (19), ప్రణతి రెడ్డి (19) ఎల్‌బీనగర్‌ అనుష్కపూర్‌లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ విద్యనభ్యసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సురేందర్‌ స్విఫ్ట్‌ కారు కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం బొమ్మలరామారం నుంచి కారులో బయలుదేరాడు. మంగళవారం ఉదయం కళాశాల హాస్టల్‌ వద్ద స్నేహితురాలు ప్రణతి రెడ్డిని పికప్‌ చేసుకున్నాడు. 

సాయంత్రం 5.45 గంటల సమయంలో వట్టినాగులపల్లి నియోపొలిస్‌ సమీపంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఆగి ఉన్న సిమెంట్‌ లారీని కారు అతివేగంతో ఢీకొంది. లారీలోకి కారు చొచ్చుకుపోయి ముందు భాగం నుజ్జునుజ్జయింది. సురేందర్, ప్రణతి అక్కడికక్కడే మృతి చెందారు. లారీలో ఇరుక్కు పోయిన కారును క్రేన్‌ సహాయంతో తీసి మృతదేహాలను వెలికి తీశారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా రోడ్డుపై లారీ నిలిపాడని, ప్రమాదం జరగగానే పారిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)