Breaking News

ర్యాపిడో ప్రయాణం చివరి ప్రయాణం అయ్యింది..!

Published on Tue, 02/24/2026 - 06:58

హైదరాబాద్: ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న యువతి.. పార్ట్‌టైమ్‌ ర్యాపిడో డ్రైవర్‌గా అదనపు సంపాదన కోసం కష్టపడుతున్న హోంగార్డు.. వేర్వేరు ప్రాంతాలు.. సోమవారం రోడ్డు ప్రమాదంలో  ఈ ఇద్దరూ మృతి చెందారు. బంజారాహిల్స్‌ పోలీసుల వివరాల ప్రకారం... 

ఏపీలోని విజయనగరానికి చెందిన కొల్లూరు అక్షిత (20) హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసి దుబాయ్‌ వెళ్లేందుకు వీసా కోసం ఆదివారం రాత్రి హైదరాబాద్‌ వచ్చింది. చింతల్‌లోని స్నేహితురాలి ఇంట్లో ఉన్న ఆమె సోమవారం ఉదయం మెహిదీపట్నంలో దుబాయ్‌ వెళ్లే ప్రాసెస్‌లో భాగంగా ఇంటర్వ్యూకు హాజరై ర్యాపిడో బుక్‌ చేసుకుంది. సంతోష్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న సయ్యద్‌ హుస్సేన్‌ (40) ఉదయం 8 గంటలకు విధులు ముగించుకున్న అనంతరం ర్యాపిడో విధుల్లోకి చేరాడు. మెహిదీపట్నంలో అక్షితను బైక్‌పై ఎక్కించుకుని పంజగుట్ట వైపు వెళుతున్నాడు. 

బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌–1 వెంగళరావు పార్కు టర్నింగ్ వద్ద మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన వాటర్‌ ట్యాంకర్‌  వీరి బైక్‌ను వెనుకనుంచి ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడ్డారు. ట్యాంకర్‌ వెనుక టైర్‌  ఇద్దరి మీదుగా వెళ్లడంతో అక్షిత అక్కడికక్కడే మృతి చెందింది. కొన ఊపిరితో ఉన్న హుస్సేన్‌ను నిమ్స్‌కు తరలించగా కొద్దిసేపటికే కన్నుమూశాడు. 

బంజారాహిల్స్‌ ఇబ్రహీంనగర్‌కు చెందిన ట్యాంకర్‌ డ్రైవర్‌ ఖాజాపాషా (30)ను  హత్యాయత్నం కింద పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా చాంద్రాయణగుట్ట అల్జుబెల్‌కాలనీకి చెందిన హుస్సేన్‌ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తెల్లారితే దుబాయ్‌ వెళ్లే ఆనందంలో అక్షిత ఉండగా, కొద్దిసేపట్లో ఇంటికి వెళ్లాల్సిన హుస్సేన్‌.. అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)