Breaking News

పాప కళ్లలోంచి బియ్యం గింజలు, గోర్లు.. వైద్యులు ఏం చెప్పారంటే..?

Published on Sun, 05/21/2023 - 10:40

ఖమ్మం: సహజంగా ఎవరి కంటి నుంచై­నా నీరు కారడం, పూసులు రావడం సహజమే. కానీ ఓ చిన్నారి కంటి నుంచి బియ్యం గింజలు, ప్లాస్టిక్‌ ముక్కలు, గోర్లు ఇలాంటివి వస్తున్నా యి. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా.. పాప కంట్లో వ్యర్థాలను పెట్టుకోవడంతో అవి కాసేపటికి బయటకు వస్తున్నాయని తేల్చారు.

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం రాజోలుకు చెందిన భూక్యా దస్రూ, దివ్య దంపతుల కుమార్తె ఆరేళ్ల సౌజన్యకు మూడు నెలల క్రితం కంట్లో నుంచి పత్తి గింజ పడగా.. తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అయినా మళ్లీ కంట్లో నుంచి పేపర్, ప్లాస్టిక్‌ ముక్కలు, బియ్యం గింజలు పడడంతో ఆందోళనకు గురైన వారు శనివారం ఖమ్మంలోని మమత ఆస్పత్రికి తీసుకొచ్చారు.

దీంతో వైద్యులు పరీక్షించి పాప గోళ్లు కొరికి ఆ ముక్కలను కంట్లో పెట్టుకుంటుండడంతో పాటు ఇతర వ్యర్థాలను కంట్లో పెట్టుకోగా, ఆతర్వాత బయటకు వస్తున్నాయని తెలిపారు. పాపను రెండు గంటల గాటు పరిశీలనలో ఉంచగా, ఆమె గోర్లు కొరికి కంట్లో పెట్టుకున్నట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా తేల్చారు. కౌన్సెలింగ్‌ ద్వారా ఈ అలవాటును మాన్పించవచ్చని వైద్యులు చెప్పినా.. తల్లిదండ్రులు మాత్రం వాటంతట అవే కంట్లోంచి వస్తున్నాయంటూ వాపోయారు.

దీంతో రెండు రోజులు సౌజన్యను ఆస్పత్రిలోనే పరిశీలనకు ఉంచి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చాక డిశ్చార్జ్‌ చేస్తామని ఆస్పత్రి ఆర్‌ఎంఓ సంతోష్‌­రెడ్డి, సూపరింటెండెంట్‌ రామస్వామి తెలిపారు.

చదవండి: షాకింగ్.. గుండెపోటుతో పదమూడేళ్ల బాలిక మృతి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)