Breaking News

‘కర్ణాటక’ స్టార్‌ క్యాంపెయినర్‌గా రేవంత్‌రెడ్డి

Published on Thu, 04/20/2023 - 10:10

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు స్టార్‌ క్యాంపెయినర్‌గా టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. గురువారంతో నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్‌ పార్టీ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు మొత్తం 40 మందితో కూడిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది.

ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌ బుధవారం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇందులో ఇద్దరు తెలంగాణ నాయకులకు అవకాశం లభించింది. పీసీసీ అధ్యక్షుడితో పాటు మాజీ క్రికెటర్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ను కూడా స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది. ఇప్పటికే ఎనిమిది మంది రాష్ట్ర నాయకులను కాంగ్రెస్‌ అధిష్టానం అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పరిశీలకులుగా నియమించింది.
చదవండి: బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆమెకు చోటు!

కాగా, బుధవారం బెంగళూరులోని రాడిసన్‌ హోటల్‌లో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశానికి వీరంతా హాజరయ్యారు.  తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో స్టార్‌ క్యాంపెయినర్‌లుగా నియమించిన వారితో పాటు కర్ణాటక సరిహద్దు జిల్లాలకు చెందిన తెలంగాణ జిల్లాల నాయకత్వాన్ని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వినియోగించుకోవాలని అధిష్టానం నిర్ణయించింది.
చదవండి: TSRTC: వినూత్న ప్రయోగం.. సర్‌ అనండి.. సర్రున అల్లుకుపొండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)