Breaking News

నెరవేరిన సీఎం హామీ

Published on Sat, 03/07/2026 - 09:34

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి:  హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా 2023 మార్చి 18న కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామం మీ­దుగా పాదయాత్రగా వెళుతున్న అప్పటి పీసీసీ అధ్యక్షుడు, నేటి సీఎం రేవంత్‌రెడ్డిని భిక్కనూరు లక్ష్మి అనే మహిళ కలిసి కూలిపోయి­న తన ఇంటిని చూడమని వే­డుకుంది. దీంతో రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌అలీ కూలిపోయిన ఆమె ఇంటిని చూసి తాము అధికారంలోకి రాగానే ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చి వెళ్లారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ‘రేవంతన్నా.. నన్ను యాది మరవకు’అన్న శీర్షికతో ‘సాక్షి’మెయిన్‌ ఎడిషన్‌లో 2023 డిసెంబర్‌ 31న కూలిపోయిన ఇంటిలో భిక్కనూరు లక్ష్మితో మాట్లాడుతున్న ఫొటో­తో ప్రచురించిన కథనానికి సీఎంవో అధికారులు స్పందించారు. అదేరోజు జి­ల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భిక్కనూరు లక్ష్మికి వెంటనే అప్పటికే పక్క గ్రామంలో నిర్మించి ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కేటాయించా­ల­ని ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు లక్ష్మి దగ్గరకు వెళ్లి డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు ఇస్తామని చెప్పారు. 

అయితే కూలిన ఇంటి స్థలంలోనే తాను ఇల్లు కట్టుకుంటానని ఆమె చెప్పడంతో ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపించారు. తొలి విడతలోనే లక్ష్మితో పాటు ఆమె తోటి కోడలు రాజమణికి కూడా ఇల్లు మంజూరైంది. ఎట్టకేలకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లక్ష్మి కుటుంబ సభ్యులు శనివారం గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పాదయాత్రలో ఇచి్చన మాట ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్మికి ఇల్లు మంజూరు చేశారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. వారి గృహ ప్రవేశానికి తాను హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పేద మహిళలకు న్యాయం చేసిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)