Breaking News

ఆ శాఖలతోనే సర్దుబాటు?

Published on Mon, 06/09/2025 - 03:57

సాక్షి, హైదరాబాద్‌: కొత్త మంత్రులకు ఏఏ శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి తన వద్ద ఉన్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా? లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా చూడాలి. అయితే..ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని, తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు విభజించే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్‌రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతోపాటు హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్థకం, మైనింగ్‌ తదితర శాఖలున్నాయి.

ఇందులో మున్సిపల్‌ శాఖను రెండుగా విభజించి ఒకటి తన వద్దనే ఉంచుకొని, మరోటి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక, విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వబోనని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో అక్రమఫోన్‌ ట్యాపింగ్, ఇతర కీలక కేసులున్న నేప థ్యంలో ప్రాధాన్యమైన  హోంశాఖను వారికి అప్పగించకపోవచ్చనే చర్చ జరుగుతోంది.

కార్మిక, పశుసంవర్థకం, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టల సంక్షేమం, మైనింగ్‌ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. కొత్తగా మంత్రుల కోసం సచివాలయంలో ఫ్లోర్‌లు, చాంబర్‌ల కేటాయింపు అనంతరం ఒకట్రెండు రోజుల్లో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు.  

కర్ణాటక తరహాలో పురపాలికల విభజన 
కర్ణాటకలో బెంగళూరు, పరిసర పట్టణ ప్రాంతాలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మంత్రిగా ఉండగా, మిగిలిన కర్ణాటక రాష్ట్రానికి మరో మంత్రి ఉన్నారు. కర్ణాటకలో ఉన్న తరహాలోనే కోర్‌ ఏరియాకు ఒకరు, మిగిలిన మున్సిపాలిటీ లకు మరొకరిని మంత్రులుగా నియమిస్తారని సమాచారం. అయితే, కోర్‌ ఏరియాను తన వద్దే ఉంచుకోవాలని రేవంత్‌ భావిస్తున్నారు. మూసీ పునరి్నర్మాణం, ఫోర్త్‌ సిటీ ఏర్పాటు తదితర కీలకాంశాలు చేపట్టాల్సి ఉన్నందున, హెచ్‌ఎండీఏ తోపాటు తాను నిర్మించతలపెట్టిన ఫోర్త్‌సిటీ పరిధిని మినహాయించి రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాలను ఒక మంత్రికి అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి పురపాలక శాఖ కార్యదర్శులకు కూడా ఇదే తరహాలో పని విభజన చేయడం గమనార్హం.

ఎవరికి.. ఏ శాఖ!
సామాజిక, ప్రాంతాల వారీగా సమీకరణల నేపథ్యంలో కొత్త మంత్రులకు ఇచ్చే శాఖలపై చర్చ జరుగుతోంది. ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన వాకాటి శ్రీహరికి మత్స్య, పశుసంవర్థక శాఖతో మరో ముఖ్యమైన శాఖ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, వివేక్‌కు కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఇవ్వొచ్చని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా కూడా సింగరేణి బెల్ట్‌ కావడం, గతంలోనూ ఈ శాఖను ఆయన సోదరుడు వినోద్‌ చూసిన నేపథ్యంలో కార్మిక శాఖ కేటాయించవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీనితోపాటు మరో ముఖ్యమైన శాఖ కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)