Breaking News

‘పొగాకు నియంత్రణ’ అంతంతే

Published on Thu, 02/01/2024 - 04:50

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ‘పొగాకు నియంత్రణ చర్యలు’అంత సంతృప్తిగా లేవని కేంద్రం స్పష్టం చేసింది. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై నియంత్రణ, బహిరంగ ప్రదే శాల్లో పొగతాగడం నిషేధంపై 2003లో ‘కోట్తా’చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2020 నవంబర్‌ నుంచి 2021 అక్టోబర్‌ వరకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన చోట్ల చట్టం ఎలా అమలవుతుందనే దానిపై, ఇంకెలా చేయొచ్చన్న దానిపై పొగాకు వినియోగం, దాని నియంత్రణపై ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేసింది.

దాని ఆధారంగా ఓ నివేదిక రూపొందించింది. అమలుపై పాండిచ్చేరిలోని జిప్‌మర్, చండీగఢ్‌కు చెందిన పీజీఐఎంఈఆర్‌లు పరిశోధన చేశా యి. 2020 నవంబర్‌లో ఒకసారి, అక్టోబర్‌ 2021 తర్వాత ఒకసారి తెలంగాణ, పాండిచ్ఛేరి, మేఘాలయలో ఈ అధ్యయనం చేశారు. ఒక్కో రాష్ట్రంలో 9 జిల్లాల్లో పరిశీలించారు. అనంతరం వాటి ఫలితాలను ఐసీఎంఆర్‌ అనుబంధ జర్నల్‌ ఐజీఎంఆర్‌లో తాజాగా ప్రచురించారు. తెలంగాణలో 2020లో మొదటి విడతలో 2,029 మందిని సర్వే చేశారు.

రెండో విడత 2021లో 1,097 మందిపై చేశారు. ‘పొగాకు నియంత్రణ చర్యలు తెలంగాణలో పెరిగాయి. అయితే కొన్నింటిలో మాత్రం తగ్గుదల ఉన్నట్టు నివేదిక చెబుతోంది. పొగాకు ఉత్పత్తుల వినియోగానికి సంబంధించి ప్రకటనల నిలుపుదలపై పురోగతి ఉందని’డాక్టర్‌ కిరణ్‌ మాదల (సైంటిఫిక్‌ కమిటీ కన్వినర్, ఐఎంఏ) అభిప్రాయపడ్డారు. 

పొగాకు బాక్సులపై స్థానిక భాషలో హెచ్చరికలు ఏవీ? 
బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వినియోగ నియంత్రణ చర్యల్లో మాత్రమే తెలంగాణలో పురోగతి ఉంది. ఉత్పత్తిదారులను నియంత్రించడంలోనూ...హెచ్చరికల్లోనూ నిర్లక్ష్యం కనిపిస్తుందని తెలిపింది. 
♦ పొగాకు ఉత్పత్తుల ప్యాక్‌పై వార్నింగ్‌ సింబల్‌ విషయంలో మొదటి దశలో 75 శాతంగా ఉండగా, రెండో దశలో అది 83 శాతానికి పెరిగింది.  
♦ పొగాకు ఉత్పత్తుల బాక్స్‌పై వార్నింగ్‌ సింబల్‌ 85 శాతం కవరయ్యేలా ఉండాలి. ఆ విషయంలో మొదటి విడతలో 75 శాతం ఉండగా, రెండో విడతలో 91 శాతంగా ఉంది.  
♦ స్థానిక భాషలో ముద్రించే విషయంలో మొదటి విడత 45 శాతం ఉంటే, రెండో విడత 13 శాతానికి దిగజారింది. 
♦ 18 ఏళ్లలోపు వారికి పొగాకు వాడకం, అమ్మకాలపై నిషేధం ఉండాలి. నిషేధం తీరు మొదటి విడతలో 95 శాతం ఉండగా, రెండో విడతలో 99 శాతం పెరిగింది.  
♦ 18 ఏళ్లలోపు పిల్లలు పొగాకు ఉత్పత్తులను ఇతరులకు అమ్మటాన్ని నిరోధించడంలో తెలంగాణలో మొదటి విడతలో 97 శాతం ఉండగా, రెండో విడతలో అది ఏకంగా 100 శాతానికి చేరింది.  

బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకం తగ్గింది
తెలంగాణలో బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగకపోవడం అధ్యయనంలో మొదటి విడత 86.9 శాతం ఉండగా, రెండోసారి 98.5 శాతానికి పెరిగింది. ఆ మేరకు మార్పు కనిపించింది.  
♦ బహిరంగ ప్రదేశాల్లో తాగొద్దన్న బోర్డులు పెట్టారు. మొదటి దశలో 45.2 శాతంగా ఉంటే, రెండో విడతలో 54.1 శాతానికి పెరిగింది. అయితే నిబంధనల ప్రకారం బోర్డులు పెట్టలేదని తేలింది. 
♦ నిబంధనల ప్రకారం బోర్డులను ఏమేరకు పెట్టారో చూస్తే... మొదటి దశలో రెండు శాతం, రెండో దశలో 15 శాతానికి పెరిగింది.  
♦ పొగాకు తాగొద్దని పెట్టే బోర్డుపై సంబంధిత అధికారి ఫోన్‌ నంబర్‌ పొందుపరచడం అనేది మొదటి దశలో 1.6 శాతం ఉంటే, రెండో దశలో 1.5 శాతానికి తగ్గింది. పొగాకు తాగకుండా ఉండే పరిస్థితులు కల్పించడంలో మొదటి దశలో 86.9 శాతం ఉండగా, రెండో దశలో 97.7 శాతానికి పెరిగింది. 
♦ సగటున చూస్తే బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగకపోవడం అనేది మొదట విడత 53.9 శాతం నుంచి రెండో విడతలో 66 శాతానికి పెరిగింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)