Breaking News

ప్రముఖ గణిత శాస్త్రవేత్త డాక్టర్‌ సీఆర్‌ రావు కన్నుమూత 

Published on Thu, 08/24/2023 - 02:21

ఏయూ క్యాంపస్‌/డాబాగార్డెన్స్‌: ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త డాక్టర్‌ సీఆర్‌ రావు (102) కన్నుమూశారు. అమెరికాలో ఉన్న ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. 1920 సెపె్టంబర్‌ 10న కర్ణాటకలోని బళ్లారి జిల్లా హడగళిలో కల్యంపూడి రాధాకృష్ణా రావు (సీఆర్‌ రావు) తెలుగు కుటుంబంలో జన్మించారు. తర్వాత ఏపీలోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో ఆయన బాల్యం గడిచింది. విశాఖలోని ఏవీఎన్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశారు. 1940లో ఏయూలో గణిత శాస్త్రం అభ్యసించారు.

అనంతరం యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతాలో ఎంఏ స్టాటస్టిక్స్‌ చేశారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలోని కింగ్స్‌ కాలేజీలో 1948లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇండియన్‌ స్టాటస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగారు. అక్కడ పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడి అక్కడ యూనివర్సిటీ ఆఫ్‌ బఫెలోలో రీసెర్చ్‌ ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఆయన 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్నారు. 477 పరిశోధన పత్రాలను సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు.

2002లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్‌ చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ సైన్స్‌ పురస్కారాన్ని అందుకున్నారు. యూకే ఇంటర్నేషనల్‌ స్టాటస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్స్, ఇంటర్నేషనల్‌ బయోమెట్రిక్‌ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. భారత స్టాటస్టిక్స్‌ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ఎన్‌ఎస్‌ భటా్నగర్‌ పురస్కారాన్ని కూడా సీఆర్‌ రావు అందుకున్నారు. ఆయన 2020 సెప్టెంబర్‌ 10న 100వ పుట్టినరోజును జరుపుకున్నారు.  

స్టాటస్టిక్స్‌లో నోబెల్‌ అంతటి గౌరవం 
సీఆర్‌ రావుకు 75 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకు గాను ఆ రంగంలో నోబెల్‌ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఆఫ్‌ స్టాటస్టిక్స్‌–2023 అవార్డును అందజేశారు. 102 ఏళ్ల వయసులో ఈ ఏడాదే ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

1945లో కోల్‌కతా మ్యాథమెటికల్‌ సొసైటీలో ప్రచురితమైన సీఆర్‌ రావు పరిశోధన పత్రానికి ఈ అవార్డు దక్కింది. ఆయన చేసిన కృషి..ఇప్పటికీ సైన్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉందని ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టాటస్టిక్‌ ఫౌండేషన్‌ తెలిపింది.

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)