Breaking News

చంద్రబాబు ఏ1గా కేసు నమోదు చేస్తాం 

Published on Sun, 08/06/2023 - 06:17

రాజమహేంద్రవరం రూరల్‌: పుంగనూరులో రెచ్చగొట్టేలా మాట్లాడి విధ్వంసానికి కారకుడైన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏ1గా కేసు నమోదు చేస్తామని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. కలెక్టరేట్‌ ఆవరణలో శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులపై టీడీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ముందే నిర్ణయించిన షెడ్యూల్‌ రూట్‌లో వెళ్లకుండా, ఎందుకు పుంగనూరులోకి ప్రవేశించాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

ఇది శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలనే కుట్రే­నని అన్నారు. బీరు బాటిళ్లు, రాళ్లు, కర్రలు వారికి అప్పటికప్పుడు ఎక్క­డి నుంచి వచ్చాయని నిలదీశారు. ఈ ఘటనలో పోలీసులు సహా 50 మందికిపైగా తీవ్ర గాయాలయ్యా­య­న్నారు. గాయపడిన పోలీసులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. పోలీసులు సంయమనంతో వ్యవహరించారని చెప్పారు. పోలీసులపై దాడి, పోలీసు వాహనాల విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 40 మందిని అదుపులోకి తీసుకున్నామని.. సీసీ పుటేజ్, ఇతర ఆధారాలు పరిశీలిస్తున్నామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)