ఇది వాస్తవిక బడ్జెట్‌

Published on Fri, 02/16/2024 - 03:46

సాక్షి, హైదరాబాద్‌: సామాజిక సమానత్వం తెచ్చే రీతిలోనే బడ్జెట్‌ రూపకల్పన చేశామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొ న్నారు. గురువారం శాసనసభలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంత్రి బదులిస్తూ..అడ్డగోలుగా హామీలిచ్చిన ప్రభుత్వాలు, వాటి అమలుకు ఆదాయం ఎలా సమకూరుతుందో తెలియని స్థితిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టాయని దుయ్యబట్టారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించినా, మంజూరులేని పరిస్థితిలో అనేక వర్గాలు ఫలితం పొందలేకపోయారని తెలిపారు. ఇలాంటి పొరపాటుకు తావులేకుండా వాస్తవిక బడ్జెట్‌ రూపొందించామని చెప్పారు.

అందుకే బడ్జెట్‌ను కుదించాల్సి వచ్చిదని వివరించారు. ప్రవేశపెట్టిన రూ.2,75, 891 బడ్జెట్‌... ఆదాయం, ఖర్చు కు మధ్య మహా అయితే 6% కన్నా తక్కువ ఉండబోదని తెలిపారు. గత పదేళ్ల కాలంలో మొత్తం బడ్జెట్‌ కేటాయిపులు రూ.14,87,834 కోట్లు అయితే, ఖర్చు చేసింది మాత్రం రూ.12,25,312 కోట్లు అని తెలిపారు. ఆదాయమే లేకుండా బడ్జెట్‌ ప్రవేశపెట్టడం వల్ల ఈ పదేళ్లలో రూ. 2,65,212 కోట్లు కేటాయింపుల్లో ఖర్చు చేయలేదన్నారు. కేంద్రనిధులు తెచ్చేందుకు బీజేపీ సభ్యులు కూడా సహకరించాలని కోరారు. ఆర్థికలోటు అధిగమించేందుకు అప్పులు చేయక తప్పదన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామన్నారు. నిరుద్యోగుల  కష్టాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రక్షాళన చేశామని, నిరుద్యోగుల కలలు నిజం చేస్తూ ఉద్యోగాల జాతర కొనసాగుతుందని చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)