Breaking News

ఎకరం.. రూ.140 కోట్లపైనే!

Published on Sat, 09/20/2025 - 00:45

సాక్షి, హైదరాబాద్‌: భూముల వేలంతో భారీగా నిధులు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనిష్టంగా రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఈ మేరకు హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన రాయదుర్గంలో భూములను వేలం వేయనుంది. నాలెడ్జ్‌ సిటీలోని 18.67 ఎకరాలను ఈ–వేలానికి తెలంగాణ ఇండ్రస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (టీజీఐఐసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక ఎకరానికి ప్రారంభ ధర రూ.101 కోట్లుగా నిర్ణయించింది. అయితే పలు నిర్మాణ సంస్థలు ఎకరాకు రూ.140 కోట్లకు పైగానే వెచ్చించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో కోకాపేట నియోపోలిస్‌ ఫేజ్‌–2లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన వేలంలో రికార్డ్‌ స్థాయిలో ఎకరం రూ.100 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకు మించి ధర పలకడం ఖాయమని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆంక్షలున్నా.. తగ్గేదేలే..: సర్వే నంబర్‌ 83/1 ప్లాట్‌ నంబర్‌ 19లో 11 ఎకరాలు, ఇదే సర్వే నంబర్‌లో ప్లాట్‌ నంబరు 15 ఏ/2లో 7.67 ఎకరాలను టీజీఐఐసీ వేలం వేయనుంది. అయితే ఈ సర్వే నంబర్‌ ఎయిర్‌పోర్ట్‌ జోన్‌ పరిధిలోకి వస్తోంది. 2022లో ఏఏఐ నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఈ ప్రాంతంలో అపరిమిత భవన నిర్మాణ ఎత్తు (ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌–ఎఫ్‌ఎస్‌ఐ)కు అనుమతి లేదు.

ప్లాట్‌ నంబరు 19లో ఎఫ్‌ఎస్‌ఐ 80 మీటర్లు, ప్లాట్‌ నంబరు 15లో ఎఫ్‌ఎస్‌ఐ 65 మీటర్ల వరకు మాత్రమే అనుమతి ఉంది. ఎఫ్‌ఎస్‌ఐపై ఆంక్షలున్నప్పటికీ అధిక ధర పెట్టేందుకు బిడ్డర్లు వెనుకాడటం లేదని తెలుస్తోంది. 470 ఎకరాలలో విస్తరించి ఉన్న నాలెడ్జ్‌ సిటీలో వందకు పైగా ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలున్నాయి. బిజినెస్‌ హబ్‌గా అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం బహుళ జాతి సంస్థలు, గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ)కు నిలయంగా మారడంతో ఎలాగైనా భూమిని దక్కించుకోవాలనే బిడ్డర్లు పోటీపడుతున్నారు.

34 మంది బిడ్డర్లు దరఖాస్తు..
వచ్చే నెల 6న జరగనున్న ఈ – వేలంలో పాల్గొనేందుకు దేశ, విదేశీ నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే నాన్‌ రీఫండబుల్‌ డాక్యుమెంట్‌ ఫీజు కింద ప్లాట్‌కు రూ.10 లక్షల చొప్పున చెల్లించి సుమారు 34 మంది బిడ్డర్లు టీజీసీఐఐసీకి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. వీరితో పాటు పలువురు స్థానిక పెట్టుబడిదారులు, డెవలపర్లు జాయింట్‌ వెంచర్‌గా ఏర్పడి వేలంలో పాల్గొనన్నారు. పలు నిర్మాణ సంస్థలు ఎకరానికి రూ.140 కోట్లకు పైగానే బిడ్డింగ్‌ చేయనున్నట్లు తెలిసింది. బహుళ జాతి సంస్థల కార్యాలయాలు, ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలు, వినోద కేంద్రాలు, బహుళ అంతస్తుల భవనాలు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో రాయదుర్గం అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో ఇక్కడి స్థలాలకు డిమాండ్‌ అధికంగా ఉంది.

వేలంతో మార్కెట్‌లో బూమ్‌..
ఈ భూముల వేలంతో మార్కెట్‌లో బూమ్‌ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ భూములు వేలంలో ఎంతకైతే ధర పలుకుతాయో చుట్టుపక్కల స్థలాలు కూడా అంతే ధర పలుకుతాయి. అయితే ఈ పరిణామం స్థానిక పెట్టుబడిదారులు, డెవలపర్లకు కొంత వరకు ఇబ్బందే అని నిపుణులు అంటున్నారు. అంత ధర పెట్టి ప్రాజెక్ట్‌లను చేపట్టినా అంతిమంగా ఆ భారం కొనుగోలుదారుల మీదనే పడుతుందని చెపుతున్నారు.

ఐటీ, ఐటీఈఎస్, కమర్షియల్, రిటైల్, రెసిడెన్షియల్, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఇలా మల్టీ జోన్‌ ప్రాంతమైన రాయదుర్గం నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో, విమానాశ్రయంతో సులువైన కనెక్టివిటీ ఉంది. ఇక్కడినుంచి రాయదుర్గం మెట్రో స్టేషన్‌కు 5 నిమిషాలు, ఔటర్‌ జంక్షన్‌కు 6 నిమిషాలు, ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌/విప్రో జంక్షన్‌కు, హెచ్‌ఐసీసీ/హైటెక్స్‌కు 15 నిమిషాలు, ఎయిర్‌పోర్ట్‌కు 40 నిమిషాల ప్రయాణ వ్యవధి ఉంటుంది. దీంతో ఇక్కడి భూములకు డిమాండ్‌ అధికంగా ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)