Breaking News

27 ఏళ్లు శ్రమించి.. 195 దేశాలు చుట్టేసి..

Published on Thu, 08/01/2024 - 12:16

ప్రపంచంలోని అన్ని దేశాలను సందర్శించడమే అతడి లక్ష్యం.. ఆ దిశగా ఎంతో కష్టపడ్డారు. సుమారు 27 ఏళ్లు ఎంతో శ్రమకోర్చి అన్ని దేశాలను సందర్శించి అరుదైన ఘనత సాధించారు. ప్రస్తుతం 195 దేశాల సందర్శన పూర్తి చేసుకుని తెలుగుగడ్డపై బుధవారం అడుగుపెట్టారు. ఈ అరుదైన ఘనత సాధించిన వ్యక్తి మన తెలుగువాడు కావడం విశేషం.

ప్రపంచాన్నే చుట్టేసిన 43 ఏళ్ల వయస్సు కలిగిన రవిప్రభు స్వస్థలం విశాఖపట్నం. ఆయన హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో చదువుకున్నాడు. పొలిటికల్‌ సైన్స్‌లో పట్టభద్రుడైన రవిప్రభు విద్యార్థి దశలోనే 1996లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వివాహం చేసుకొని ఉద్యోగం చేసుకుంటూనే విదేశాలను సందర్శించడం ప్రారంభించారు. భూటాన్‌ దేశాన్ని సందర్శించడంతో ప్రారంభమైన ఆయన యాత్ర వెనుజులతో ముగిసింది. ప్రపంచంలోని దేశాలను సందర్శిస్తూనే 2020లో ఒక యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. మొత్తం సందర్శన విశేషాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తూ వచ్చారు.

అన్ని దేశాలను చుట్టేసి వచ్చిన ఆయన రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్‌ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 600 మందికి పైగా అంతరిక్షంలోకి వెళ్లారు. 6,600 మంది ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు. ప్రపంచంలోని 850 కోట్ల మందిలో 280 మంది మాత్రమే ప్రతి దేశాన్ని సందర్శించారని అన్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన 280 మందిలో తనకు స్థానం లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. 27 ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రయాణాల కోసం రూ.25 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)